iDreamPost

అలా అయితే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం: మృణాల్‌ ఠాకూర్‌

  • Published Mar 20, 2024 | 11:09 AMUpdated Mar 20, 2024 | 11:09 AM

Mrunal Thakur: బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాలు ఠాకూర్ తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ చిన్నది నాకు వారితో సమయం చాలా అవసరం అందుకే సినిమాలకు ఈ గ్యాప్ అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమకు ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే టాలీవుడ్ లో తమ సత్తాను చాటుతూ స్టార్ హీరోల సరసన ఆఫర్లు అందుకుంటున్నారు. అయితే అలా అందుకున్న వారిలో ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపి ఆ తర్వాత ఇక్కడ సెటిల్ అవ్వలేక కనుమరగవుతున్నారు. కానీ, ఇప్పడు మనం చెప్పుకున్న ఈ బ్యూటీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సినిమాలో ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తూ వరుస విజయాలను అందుకుంటుంది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ కు సీతాగా పరిచయమైన మృణాల్ ఠాకూర్. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకోవడంతో పాటు మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ నాకు వారితో సమయాలు చాలా అవసరం అందుకే సినిమాలకు గ్యాప్ తీసుకుంటున్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాలు ఠాకూర్ సీతారామం సినిమాతో సీతామహాలక్ష్మీగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన ఇటీవలే హాయ్ నాన్న సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవడంతో.. మృణాలుకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే.. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను మెప్పించింది.కాగా, త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే వరుస విజయాలతో కేరిర్ మంచి ఫామ్ లో ఉన్న మృణాల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వైరల్ గా మారాయి. అసలు మృణాలు ఏమన్నరంటే.. నేను కంటినిండా నిద్రపోయి చాలా రోజులు అయ్యింది. వరుస షూటింగ్స్ తో బిజీగా మారాను. దీంతో.. దాదాపు రెండేళ్లుగా లైఫ్ ను బిజీగానే గడుపుతున్నాను. అయితే ఎంత బిజీగా ఉన్న చిన్న చిన్న విరామాలు, ఫ్యామిలీతో గడిపే క్షణాలు చాలా అవసరం. అందుకే ఇప్పుడు షూటింగ్ నుంచి విరామం తీసుకొని కుటుంబంతో సమయం గడుపుతున్నా అని చెప్పింది. అలాగే ఇలా విరామం తీసుకోవడం వల్ల సినిమాల ఎంపికల్లో మంచి అడుగులేస్తాం. లేదంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఆవకాశం ఉందంటూ మృణాలు తెలిపింది. మరి, మృణాలు సినిమాల విషయంలో విరామం నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి