iDreamPost

థియేటర్లు ఖాళీ – పరిష్కారమేంటి

థియేటర్లు ఖాళీ – పరిష్కారమేంటి

తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షోలు టైంతో సంబంధం లేకుండా రద్దవుతున్నాయి. భారీ వర్షాలకు తోడు మొన్న వచ్చిన కొత్త సినిమాల్లో కంటెంట్ మరీ యావరేజ్ గా కూడా లేకపోవడంతో జనం థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ది వారియర్ బుకింగ్స్ కూడా చాలా నెమ్మదిగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్ డేకు రెండో రోజు నుంచే నెగటివ్ షేర్స్ మొదలయ్యాయి. జార్జ్ రెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ నటించిన గంధర్వ పరిస్థితి ఇంకా ఘోరం. కనీసం ఓటిటికి ఇచ్చేసినా నయమేమో అనిపించేలా పెర్ఫార్మన్స్ మరీ దారుణంగా ఉంది. మా నాన్న నక్సలైట్, మాయోన్ గురించి చెప్పడానికేం లేదు

కొద్దోగొప్పో విక్రమ్, ఎఫ్3, మేజర్ లే కనిష్ట స్థాయిలో వసూళ్లు రాబడుతున్నాయి. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఏ థియేటర్ చూసినా ఏ షో గమనించినా మొత్తం కలెక్షన్ 5 వేలు దాటడం లేదు. కొన్ని మరీ అన్యాయంగా రెండు వేల లోపే ఉంటున్నాయి. ఇది కనీసం కరెంట్ బిల్లుకు కూడా కిట్టుబాటు కాదని యజమానులు అంటున్నారు. దానికి తోడు టికెట్ రేట్లు తగ్గించే విషయంలో నైజామ్ డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోకపోవడం సిచువేషన్ ని ఇంకా దిగజారుస్తోంది. ఒకపక్క వర్షాల వల్ల అతలాకుతలం అవుతుంటే వారియర్ లాంటి సినిమాల మల్టీ ప్లెక్స్ రేట్ 295 రూపాయలకు ఫిక్స్ చేయడం బూమరాంగ్ అయ్యేలా ఉంది.

దీనికి పరిష్కారాలు ఇండస్ట్రీ చేతుల్లోనే ఉంది. ఓటిటి గ్యాప్ తగ్గించినంత మాత్రాన జనం థియేటర్లకు పరిగెత్తరు. వాళ్లకు కంటెంట్ ముఖ్యం. ఆకట్టుకునే అంశాలు ఉండాలి. అవి యాక్షన్ మూవీసే కానక్కర్లేదు. ఎంటర్ టైన్ చేసే ఏ బొమ్మైనా సరే అందుబాటు ధరలో ఉంటే చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. అన్నీ కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ రేట్లే కావాలనుకుంటే ఇలా ఎదురు దెబ్బలు తప్పవు. అంత సర్కారు వారి పాటనే రెండు వారాల ముందే చేతులు ఎత్తేసింది. ఎఫ్3 ఏదో ఫ్యామిలీ ఆడియన్స్ అండతో బ్రేక్ ఈవెన్ దగ్గరకు వెళ్ళింది కానీ అదీ లాభాలు ఇవ్వలేదు. సో ఇదంతా జాగ్రత్తగా విశ్లేషించుకుని సరైన మార్గంలో వెళ్లడం ఒక్కటే పరిశ్రమ ముందున్న సరైన ఆప్షన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి