iDreamPost

ఈ అమ్మాయి ఇప్పుడో హీరోయిన్.. తన సినిమాలతో సెగలు పుట్టిస్తోంది

స్కూల్ డ్రెస్సులో మెరిసిపోతున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఇప్పుడో స్టార్ నటి. తెరపై కనిపిస్తే చాలు... ఆమె అందానికి, నటనకు ఫిదా కావాల్సిందే. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి

స్కూల్ డ్రెస్సులో మెరిసిపోతున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఇప్పుడో స్టార్ నటి. తెరపై కనిపిస్తే చాలు... ఆమె అందానికి, నటనకు ఫిదా కావాల్సిందే. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి

ఈ అమ్మాయి ఇప్పుడో హీరోయిన్.. తన సినిమాలతో సెగలు పుట్టిస్తోంది

సినిమాలు, యాక్టింగ్ అంటే ఫ్యాషన్‌తో ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం.. అంచలంచెలుగా ఎదుగుతూ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం ఓ సవాలైతే.. అదే పరిశ్రమలో కొన్నాళ్ల పాటు కొనసాగడం మరో సవాల్. అవకాశాలు ఉంటేనే కనీసం దశాబ్ద కాలమైనా కంటిన్యూ అయ్యేందుకు అవకాశం ఉంది. లేకుంటే వెంటనే పెట్టే బేడా సర్దుకుపోవాల్సిందే. ఇప్పటి హీరోయిన్లు కాస్త తెలివిగానే ఆలోచిస్తున్నారు. ఇల్లు ఉండగానే చక్కదిద్దుకోవాలన్న సామెతను అర్థం చేసుకుని.. తామ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు అవసరమైన మెళకువలను నేర్చుకుంటున్నారు. హీరోయిన్ అంటే పరిధి మేరకు నటించి వెళ్లిపోవాలన్న పాత కట్టుబాట్లను తెంచి.. గ్లామరస్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో అదరగొట్టేస్తున్నారు.

ఇదిగో స్కూల్ యూనిఫాం వేసుకుని, రెండు పిలకలతో చిరు నవ్వులు చిందిస్తున్న ఈ యువతిని చూశారా.. ఈ సమయంలో ఊహించి ఉండదు.. ఇండస్ట్రీలో వర్సటైల్ నటిగా గుర్తింపు తెచ్చుకుంటానని. అందులో గ్లామరస్ అండ్ బోల్డ్ కంటెట్ కథలకు చెమటలు పట్టిస్తానని. ఆమె కేవలం నటి మాత్రమే కాదు. సింగర్, డ్యాన్సర్, మ్యూజిషియన్ కూడా. తెలుగు కన్నడ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బబ్లీ గార్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన హస్కీ వాయిస్.. మాటలతోనే మత్తెక్కిస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. ఎస్తేర్ నోరోన్హ్. ఇండస్ట్రీలో ఉన్న ఏడు భాషల్లో నటించిన అనుభవం తనది. కేవలం తెలుగు మాత్రమే కాదు.. హిందీ, మరాఠి, తులు, కొంకణీ, తమిళ్ చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది.

కర్ణాటకలో పుట్టిన ఈ చిన్నది.. గిటార్, పియానో, కర్ణాటక్ సంగీత్, భరత నాట్యంలో ప్రావీణ్యం పొందింది. 9 ఏళ్ల ప్రాయంలోనే కొంకణి భాషలో పాటలు పాడేది. ఆ తర్వాత ఆమె కథక్, బాలీవుడ్ డ్యాన్సింగ్ నేర్చుకుంది. 2012లో వచ్చిన బారోమస్ అనే చిత్రంలో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్తేర్.. తెలుగు వెయ్యి అబద్దాలు అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. భీమవరం బుల్లోడుతో క్లిక్ అయ్యింది. అయితే ఈ సినిమాలు ఆమెను హీరోయిన్‌గా నిలబెట్టలేకపోయాయి. మిగిలిన భాషల్లో వర్క్ చేస్తూనే.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన అవకాశాలు వదిలిపెట్టలేదు. లీడ్ క్యారెక్టర్ నుండి సపోర్టింగ్ రోల్ ఛాన్సులు రావడం స్టార్ అయ్యాయి. అయినా కూడా తనను తాను నిరూపించుకోవాలని తాపత్రయ పడింది.

జయ జానకి నాయక, ఐరావతంలో కీలక పాత్రలు పోషించింది. కానీ  ఆమెను చూసి షాక్ తిన్నది మాత్రం.. 69 సంస్కార్ కాలనీ అనే చిత్రంతో. ఇందులో కుర్రవాడికి, ఆంటీకి మధ్య ప్రేమ, రొమాన్స్ ఉంటుంది. బీ గ్రేడ్ మూవీలా ఉన్నా ఇప్పటి పరిస్థితులను చూపిస్తుంది. అప్పటికే ప్రముఖ స్టార్ సింగర్, ర్యాపర్ నోయల్ సేన్‌తో పెళ్లి, విడాకులు చోటుచేసుకున్నాయి. ఆ ఫేజ్ నుండి బయటకు వచ్చి.. ఇలాంటివి వరుస సినిమాలు చేసింది. ఆ తర్వాత వచ్చిన రెక్కీలో కూడా ఈ తరహా పాత్రలోనే మెప్పించింది. రేఖ పాత్రలో భర్తను మోసం చేసే భార్యగా, ఆ ఊరి జమీందారుతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని మహిళగా నటించింది. ఈ రెండు ఆమెను భర్తను మోసం చేసే ఇల్లాలిగానే చూపించాయి. కానీ ఆమెలో అంతకు మించిన నటన దాగి ఉంది. ఇప్పుడు సరికొత్త కథల వైపు అడుగులు వేస్తోంది. గత ఏడాది చాంగురే బంగారు రాజా, డెవిల్ చిత్రాలతో అలరించిన ఈ సుందరి.. ఇప్పుడు టెనెంట్ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి