iDreamPost

కరోనా ఎఫెక్ట్ ఒలంపిక్స్ వచ్చే సంవత్సరమే …

కరోనా ఎఫెక్ట్  ఒలంపిక్స్ వచ్చే సంవత్సరమే …

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఒలంపిక్ క్రీడలను ఏడాదిపాటు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జపాన్ రాజధాని టోక్యోలో వచ్చే జూలై 24 నుంచి ఒలంపిక్స్ ప్రారంభం కావాల్సి ఉంది.కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పోటీలో పాల్గొనమనే అనేక దేశాల క్రీడా సంఘాలు మరియు క్రీడాకారుల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని వాయిదా వేశారు.నేడు టోక్యో ఒలంపిక్స్ నిర్వాహకులతో జరిగిన సమావేశంలో ఐఓసీ ప్రపంచ క్రీడా పోటీల నిర్వహణను రీషెడ్యూల్ చేసి కొత్త తేదీలను ఖరారు చేసింది.

తాజాగా టోక్యో ఒలంపిక్స్ నిర్వహణ కమిటీ వచ్చే ఏడాది 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలంపిక్స్ ను నిర్వహిస్తామని నిర్వహణ కమిటీ చైర్మన్ యాషిరో మోరి ప్రకటించాడు.దీనితో పాటు పారా ఒలింపిక్స్ క్రీడలను వచ్చే ఏడాది ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరుపుతామని టోక్యో ఒలంపిక్స్ నిర్వహణ కమిటీ ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని దేశాల క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీల నిర్వహణ కోసం ఇప్పటికే జపాన్ 12.6 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.క్రీడలను వాయిదా వేయడం వల్ల 4 బిలియన్‌ డాలర్ల మేర భారం పెరుగుతుందని క్రీడా ఆర్థికరంగం నిపుణుడు మియామోటో తెలియజేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి