iDreamPost

మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

బంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అందుకే దేశంలో బంగారానికి ఎంతో డిమాండ్ ఉంది.  అయితే బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. బంగారం ధరలు అనేవి గత పది రోజులనుండి తగ్గుముఖం పట్టాయి. అయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పసిడి ప్రియులకి ఆనందాన్ని కలిగించే వార్త.. నేడు మంగళవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక ధరల విషయానికి వస్తే..

 గత పది రోజలు నుంచి బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి.  ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి వాటి కారణంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు జరుగు తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నేడు బంగారం మార్కెట్ లో బంగారం ధర 24 క్యారెట్ల గోల్డ్ 10గ్రాములు ధర రూ. 160 తగ్గి రూ. 58,040కి చేరింది. 10గ్రాముల పసిడి ధర 22 క్యారట్ రూ. 150 దిగొచ్చి రూ. 53,200కి చేరింది. సోమవారం ఈ ధర రూ.53,350గా కొనసాగింది. ఇక 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,320గా ఉంది. నిన్న ఈ ధర రూ. 58,200గా ఉండేది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,804గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,190గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,350గా ట్రెండ్ అవుతుంది. హైదరాబాద్​లో నేడు 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,200గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,040గా నమోదైంది. విజయవాడలో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 500 తగ్గిపోయి రూ. 75, 500 గా నమోదు అవుతుంది. సోమవారం నాడు ఈ ధర రూ. 73,500గా కొనసాగింది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 75,500 పలుకుతోంది. విజయవాడ, విశాఖ లో సైతం అవే ధరలు కొనసాగతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి