iDreamPost

కొత్త జీవితం ఆరంభిస్తున్నామనే ఆనందం.. అంతలోనే విషాదం!

కొత్త జీవితం ఆరంభిస్తున్నామనే ఆనందం.. అంతలోనే విషాదం!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన వేడుక. అందుకే ప్రతి యువత.. తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అందరిలానే ఓ జంట కూడా ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక ఎన్నో ఆశలతో తమ కొత్త జీవితం ఆరంభిస్తున్నామనే సంతోషంలో ఆ నూతన దంపతులు ఉన్నారు. ఆ ఆనందం కాస్తా విషాదంగా మారింది. సరికొత్త వెలుగులను వెతుకూతు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం వారి ఆశలను చిదిమేసింది. జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నూతన వధువు మృతి చెందగా, ఆమె భర్త, అత్తమామలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన అంబటి శ్రీను, నాగమణి దంపతుల ప్రశాంత్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రశాంత్ హైదరాబాద్ లో కారు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆయనకు ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడేనికి చెందిన సింధుజ(22) అనే యువతితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఇక తామిద్దరం కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించాలని ఆ నూతన దంపతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి జంటను చూసి అందరు తెగ పొగిడారు. చూడముచ్చటైన జంట అంటూ అందరు ఆశీర్వదించారు. ఇలా పెద్దలు ఒకటి తలిస్తే విధి ఒకటి తలచింది. బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం వారి ఆశలను ఆవిరి చేసింది.

ప్రశాంత్.. తన తల్లిదండ్రులు, భార్య సింధుజతో కలిసి హైదరాబాద్ వెళ్తున్నాడు. ఈక్రమంలో బుధవారం తెల్లవారుజామున కుందారం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. కారులోని బెలూన్లు తెరుచుకున్నా.. అవి పగిలిపోయాయి.  ముందు సీట్లో కూర్చున్న సింధుజ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రశాంత్.. అతడి తల్లిదండ్రులు నాగమణి, శ్రీనులకు తీవ్ర గాయాలయ్యాయి.  స్థానికులు గమనించి.. వెంటనే 108కి సమాచారం అందించారు. క్షతగాత్రులను జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కారు నడుపుతున్న ప్రశాంతే నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు తెలిపారు.  మృతురాలి సోదరుడి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ విషాద ఘటనలో తప్పు విధిదా?.. కారు నడిపిన ప్రశాంత్ దా?.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గే యాప్‌లో ఛాటింగ్..గదికి రమ్మని పిలిచాడు.. చివరకు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి