iDreamPost

భర్త స్నేహితుడిని నమ్మడమే పాపం అయ్యింది! దారుణ ఘటన!

వివాహబంధంతో ఒక్కటైన ఆ జంట ఎంతో అన్యోనంగా ఉన్నారు.. ఆ జంటను చూసి అందరూ మెచ్చుకున్నారు.. అంతలోనే..

వివాహబంధంతో ఒక్కటైన ఆ జంట ఎంతో అన్యోనంగా ఉన్నారు.. ఆ జంటను చూసి అందరూ మెచ్చుకున్నారు.. అంతలోనే..

భర్త స్నేహితుడిని నమ్మడమే పాపం అయ్యింది! దారుణ ఘటన!

వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంట ఎంతో అన్యోన్యంగా నూరేళ్లు జీవించాలని బంధుమిత్రులు దీవిస్తుంటారు. వివాహనంతరం చాలా వరకు నూతన దంపతులు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తుంటారు. కొంతమంది దంపతులు ఉన్నంతలో సర్ధుకుపోతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా కాపురం చేసుకుంటారు. ఇంకొంతమంది అర్భాటాలకు పోతూ అడ్డగోలుగా అప్పులు చేసి తర్వాత చిక్కుల్లో పడుతుంటారు. అప్పు ఇచ్చేవాళ్లు తర్వాత రాబందుల్లా వెంటపడుతూ ఉంటారు. అది తట్టుకోలేక చాలా మంది తీవ్ర నిర్ణయం తీసుకుంటారు. అలాంటి ఘటనే మైసూరులోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

స్నేహితుడికి ఇచ్చిన అప్పు తీర్చలేదని ఓ జంట వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైసూరులోని యరగనహళ్లిలో చోటుచేసుకుంది. యరగనహళ్లి కి చెందిన దంపతులు విశ్వ(34), సుష్మ(28) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మైసూరులోని అలనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కూరగాయల వ్యాపారం చేసే మృతుడు విశ్వ తన స్నేహితుడైన శివ అనే వ్యక్తికి రూ.5 లక్షలు ఇచ్చాడు. ఇందుకోసం కొంతమంది వద్ద  అప్పు తీసుకొని శివకు సాయం చేశాడు. ఇటీవల ఇప్పించిన డబ్బు శివను తిరిగి ఇవ్వమనడంతో  విశ్వతో గొడవ పడ్డాడు శివ. మరోవైపు విశ్వకు అప్పు ఇచ్చిన వాళ్లు తమ అప్పు చెల్లించాలని బలవంతం చేయడం మొదలు పెట్టారు. ఎలాగైనా అప్పు తీరుస్తా అంటూ విశ్వ, సుష్మ అప్పల వాళ్లకు సర్ధి చెబుతూ వచ్చారు.

మరోవైపు నమ్మించి మోసం చేసిన శివ తిరిగి డబ్బు ఇవ్వడానికి ససేమిరా అనడంతో దంపతులకు ఏం చేయాలో పాలుపోక కుమిలిపోయారు. అప్పు తీర్చే స్తోమత లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు. తమను వేధించిన వారి గురించి చెబుతూ చనిపోయే ముందు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ఆత్మహత్యకు పాల్పపడ్డారు. ఈ ఘటనపై అలనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లైన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్న ఆ జంట అప్పులు ఊబిలో కూరుకొని ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి