iDreamPost

ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు బలికొన్న ఆర్టీసీ బస్సు

ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు బలికొన్న ఆర్టీసీ బస్సు

ఈ మద్యకాలంలో దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మొదలు పెద్దవాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయి ఎన్నో కుటుంబాల రోడ్డున పడుతున్నాయి. ఎంతోమది అనాథలుగా మిగిలిపోతున్నారు. అతివేగం, అనుభవ రాహిత్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా డ్రైవర్లు మారకపోవడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సు బైక్ ని ఢీ కొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటన అల్లాదుర్గం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఆర్టీసీ బస్సు ప్రమాదాలు బాగానే పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న విజయవాడలో డ్రైవర్ అనుభవ రాహిత్యంతో బస్సును కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లి ముగ్గురు ప్రాణాలు బలికొన్నాడు. ఈ ఘటన మరువక ముందు ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే చనిపోయారు.. మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేష్ సమీపంలోని రాంపూర్ స్టేజ్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాదుర్గం మండల పరిధిలోని సీతానగర్ గ్రామానికి చెందిన చిన్నోల సాయి కుమార్ (13), విజయ్ (16), అజయ్ ముగ్గురూ ఒకే బైక్ పై రాంపూర్ బ్రిడ్జీ కింది నుంచి తమ సొంత గ్రామానికి బయలుదేరారు. అతే సమయంలో హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాంపూర్ స్టేజ్ వద్ద విద్యార్థుల బైక్ ను ఢీ కొట్టింది. దీంతో సాయి కుమార్, విజయ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.

ఈ ప్రమాదంలో అజయ్ కి తీవ్రంగా గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సాయి కుమార్ పెద్దశంకరంపేట గవర్నమెంట్ స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. విజయ్ మోడల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాడు. బస్సు డ్రైవర్ వేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలి కావడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్టీసీ బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. డ్రైవర్ ని వెంటనే శిక్షించాలని.. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డు పై బైటాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. విషయం తెలుసుకున్న అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల కుటుంబాలను ఓదార్చారు. న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి