iDreamPost

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న చివరి లెటర్!

విద్యకు మార్కులు ప్రామాణికం కాదు అని అంటారు.. కానీ కొంతమంది విద్యార్థులు తమకు మార్కులు తక్కువ వచ్చాయని మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.

విద్యకు మార్కులు ప్రామాణికం కాదు అని అంటారు.. కానీ కొంతమంది విద్యార్థులు తమకు మార్కులు తక్కువ వచ్చాయని మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న చివరి లెటర్!

నేటి సమాజంలో గౌరవంగా బతకాలంటే చదువు ఎంతో అవసరం. అందుకే తల్లిదండ్రులు తమ స్థోమతకు మించి విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు తమ స్కూల్, కాలేజ్ లో మంచి మార్కులతో పాస్ కావాలనే ఉద్దేశంతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తూ వాళ్లను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నట్లు ఎన్నో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో కొంతమంది మార్కులు తక్కువ వస్తున్న విద్యార్థులు అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఉపాధ్యాయులను మెప్పించలేక బలవన్మరణాలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కరీంనగర్ జిల్లా విషాదం చోటు చేసుకుంది. చింతకుంట గురుకుల కాలేజ్‌లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీఈసీ చదువుతున్న అక్షిత మృతి తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి చావుకు కళాశాల ప్రిన్సిపల్ వేధింపులే అని ఆరోపించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతురాలి బంధువులకు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలపడంతో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి గొడవ సర్ధమణిగేలా చేశారు. జగిత్యాలకు జిల్లా మ్యాడంపల్లి గ్రామానికి చెందిన అక్షిత బలవన్మరణానికి పాల్పపడే ముందు రాసిన లేఖ ప్రతి ఒక్కరి హృదయాలను కలచి వేస్తుంది. ‘సారీ అమ్మా చనిపోతున్నా.. నా కన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారు, కానీ నా వల్ల కావడం లేదు అందుకే నేను చనిపోతున్నా, నాకు ఈ బతుకు వద్ద’ అంటూ అక్షిత లేటర్ లో రాసింది.

అక్షిత చనిపోయే ముందు సారీ అమ్మా, నాన్న, సాహితి.. నేను రాత్రి 11 గంటలకు చనిపోతా.. సారీరా నిన్ను వదిలి వెళ్లిపోతున్నాను అంటూ చివరి లేఖ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేలా ఉంది. చదువు విషయంలో వెనుకబడి ఉండటం వల్ల అక్షిత మానసికంగా కృంగిపోయి బలవన్మరణానికి పాల్పపడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చదువు విషయంలో ఉపాధ్యాయుల ఒత్తిడి, హాస్టల్ లో సంరక్షణ సక్రమంగా లేకపోవడం వల్లనే తమ బిడ్డ కన్నుమూసిందని మృతిరాలు తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ప్రిన్సిపల్ పై మండిపడుతున్నారు. సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి తమతో ఎంతో సంతోషంగా ఉన్న అక్షిత ఇక కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురు చావు విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి