iDreamPost

అనుమానంతో భార్యను కత్తితో పొడిచి… భర్త ఆత్మహత్య

ఈ మద్య భార్యాభర్తలు చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇక వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏకంగా చంపుకుంటున్నారు.

ఈ మద్య భార్యాభర్తలు చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇక వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏకంగా చంపుకుంటున్నారు.

అనుమానంతో భార్యను కత్తితో పొడిచి… భర్త ఆత్మహత్య

దేశంలో వివాహబంధం ఎంతో అపురూపమైనది. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటవుతారు జంట. నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. కానీ ఈ మద్య చిన్న చిన్న వివాదాలకే భార్యాభర్తల మద్య అంతరాలు పెరిగిపోతున్నాయి. గొడవలు, కొట్టుకోవడాలు ఇలా ఎన్నో కారణాల వల్ల విడిపోతున్నారు. ఇదిలా ఉంటే అక్రమసంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఏకంగా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నాయి. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఓ భార్యపై భర్త అనుమానంతో దారుణంగా హత్యచేశాడు. ఈ విషాద ఘటన గుడివాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. చివరికి భార్యాభర్తల చావుకు కారణం అయి చిన్నారిని అనాథగా చేసింది. భార్యపై అనుమానంతో భర్త పదునైన కత్తితో 12 సార్లు పొడిచి చంపిన తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. గుడివాడలో ఆదివారం ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రామలక్ష్మికి గోదావరి జిల్లా అప్పన్నపేటకు చెందిన తాతపూడి సూర్యనారాయణతో 2017, మే 24న వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో చక్కగా కాపురం చేసుకుంటు సంతోషంగా ఉన్నారు. వీరికి హేమాన్ష్ (4) బాబు ఉన్నాడు. గత ఏడాది నుంచి సూర్యనారయణకు తన భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి దారుణంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

husband killed his wife

సాఫీగా సాగిపోతున్న వారి కాపురంలో అనుమానం పెనుభూతం అయ్యింది.. భార్యాభర్తల మద్య చిచ్చు పెట్టింది. భార్యపై చేయి చేసుకోవడంతో అలిగి తన పుట్టింటికి వచ్చింది రామలక్ష్మి. పెద్దలు నచ్చజెప్పి మరోసారి ఇలాంటిది జరగవొద్దని సర్ధిచెప్పి కాపురానికి పంపించారు. కొన్నిరోజుల తర్వాత సూర్యనారయణ మళ్లీ భార్యను అనుమానిస్తూ హింసించడం మొదలు పెట్టాడు. ఆ బాధలు తట్టుకోలేక రామలక్ష్మి ఈ ఏడాది ఆగస్టు ఏలూరు జిల్లా గణపవరం పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అల్లుడు ఇంటికి వస్తే మాట్లాడి కాపురానికి పంపించాలని అత్తమామలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్యనారయణ ఆదివారం పదునైన కత్తితో రామలక్ష్మిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. 12 సార్లు పొడి పొడిచి చంపాడు.

రామలక్ష్మి ఆర్తనాదాలు విన్న తండ్రి వెంకన్న అక్కడికి వచ్చేసరికి రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. వెంటనే 108 కి కాల్ చేసి గుడివాడ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ రామలక్ష్మి చనిపోయింది. మరోవైపు సూర్యనారాయణ తనతోపాటు పురుగుల మందు తెచ్చుకొని సేవించి ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతో పచ్చని కాపురం నిప్పులు పోసుకున్నారని.. కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి