iDreamPost

షాక్ ఇస్తున్న బంగారం.. నేటి ధరలు!

షాక్ ఇస్తున్న బంగారం.. నేటి ధరలు!

దేశంలో రోజు రోజుకీ బంగారం డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఈ మద్య ఇజ్రయెల్ – పాలస్తినా మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా బంగారం రేట్లు మళ్లీ పెరిగిపోతున్నాయి. అయినా కూడా పండుగలు, పెళ్లి ముహుర్తాలు బాగా ఉండటంతో మహిళలు బంగారం ఆభరణాలు కొనుగోలు కోసం జ్యువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు. గత నెల వరుసగా బంగారం ధరలు దిగివచ్చాయి. కానీ వారం రోజుల నుంచి మళ్లీ పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజు కాస్త స్థిరంగా ఉన్నా నేడు మళ్లీ పసిడి ధర పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని.. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఇప్పుడు చేస్తే మంచిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గురువారం మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

గత వారం రోజుల నుంచి ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా ప్రపంచ మార్కెట్ లో అనిశ్చితి ఏర్పడింది.. ఈ ప్రభావం ఎక్కువగా బంగారం పై చూపిస్తుంది. ఆరు రోజుల నుంచి బంగారం ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాంటే కొంతమంది ఊగిసలాడిపోతున్నారు. మరికొంత మంది భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశం ఉందని.. ఇప్పుడే కొంటున్నారు. గురువారం స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. శుక్రవారం మళ్లీ పరుగులు పెట్టింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ పట్నంలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరరూ.54,000 గా కొనసాగుతుంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 58,910 ట్రెండ్ అవుతుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో రూ.75,500 గా పలుకుతుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధరరూ.54,150 గా కొనసాగుతుంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 58,060 గా కొనసాగుతుంది. కోల్‌కతా, ముంబైలో 22 క్యారెట్స్ ధర రూ. రూ. 54,000 కాగా, 24 క్యారెట్స్‌ గొల్డ్‌ ధర రూ.58,910 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధరరూ.54,150గా కొనసాగుతుంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 59,070గా కొనసాగుతుంది. బెంగుళూరులో 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధరరూ. 54,000గా కొనసాగుతుంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 58,910గా ట్రెండ్ అవుతుంది. ఇక ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగుళూరులో కిలో వెండి ధర. 72,600 గా కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర 75,500గా ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి