iDreamPost

అందమే ఆమెకు శాపమైంది.. భర్త చేతిలో దారుణం!

నేటికాలంలో దంపతలు మధ్య జరుగుతున్న గొడవలు బాగా పెరిగిపోయాయి. అంతేకాక క్షణికావేశంలో భాగస్వామిపై దారుణానికి తెగపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో అలాంటి దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

నేటికాలంలో దంపతలు మధ్య జరుగుతున్న గొడవలు బాగా పెరిగిపోయాయి. అంతేకాక క్షణికావేశంలో భాగస్వామిపై దారుణానికి తెగపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో అలాంటి దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

అందమే ఆమెకు శాపమైంది.. భర్త చేతిలో దారుణం!

నేటికాలంలో నేరాలు ఘోరాలు బాగా పెరిగి పోయాయి. ముఖ్యంగా కుటుంబాల్లో జరుగుతున్న దారుణాలు అందరని ఆశ్చర్యాని కలిగిస్తుంటాయి. దంపతుల మధ్య వచ్చే చిన్నపాటి గొడవలు..పెరిగి పెద్దవి అయ్యే ప్రాణాలు తీయడం లేదా తీసుకునే స్థితికి వెళ్తుంటాయి. వివాహేతర సంబంధాలు, భాగస్వామి పై అనుమానం, ఆర్థిక సమస్యలు ఇలా అనేక రకాల కారణలతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి తన అందమైన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ శివారు ప్రాంతం హర్యానాలోని గురుగ్రామ్ లో గౌరవ్ శర్మ(32) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గురుగ్రామ్ లోని డీఎల్ఎప్ ఫేజ్-3లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అతడి స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా. అతడికి లక్ష్మీరావత్(24) అనే యువతితో వివాహం జరిగింది.  చాలా ఏళ్ల పాటు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి దాంపత్యానికి గుర్తుగా  ఓ పాప కూడా జన్మించింది. మరి.. ఏమైందో ఏమో తెలియదు కానీ  భార్య లక్ష్మీరావత్ ను  గౌరవ్ శర్మ దారుణంగా హత్య చేశాడు.

అయితే ఆమెపై అనుమానంతోనే ఈ దారుణానికి  పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఆమె అందంగా పుట్టమే ఆమెకు శాపంగా మారిందని మరికొందరు అభిప్రాయ పడ్డారు. ఇక భార్యను చంపిన తరువాత గౌరవ్ ఇంటి నుంచి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో  గౌరవ్ నివాసం ఉండే అపార్ట్ మెంట్ కు పోలీసులు చేరుకున్నారు.  పోలీసులు చేరుకునే సమయానికి మహిళ మృతదేహం పక్కన ఏడుసున్న చిన్నారి కనిపించింది. ఇక అక్కడి నుంచి పారిపోయిన మృతురాలి భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, గౌరవ్ శర్మ సోమవారం ఉదయం 10.30 గంటలకు తాను నివాసం ఉండే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చేరుకున్నాడు. ఢిల్లీ మెట్రో రైళ్లుకు సంబంధించిన బ్లూ లైన్‌లో చివరి స్టేషన్ కౌశంబి మెట్రో స్టేషన్‌ కి చేరుకున్నాడు. అక్కడ స్టేషన్ చివరి ప్రాంతం వద్దకు వెళ్లి పైకి ఎక్కాడు. స్టేషన్‌ అంచుకు చేరుకుని పార్కింగ్‌ ప్రాంతం వైపు కిందకు దూకేశాడు. తీవ్రంగా తలకు గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గౌరవ్ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

మృతుడు గౌరవ్‌ శర్మ గురించి పోలీసులు ఆరా తీయగా భార్యను హత్య చేసి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడని, అనంతరం భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు  పోలీసులు తెలుసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోని తల్లి మృతదేహం వద్ద చిన్నారి ఏడ్వటం చూసి పోలీసులు, స్థానికులు చలించిపోయారు. మరి.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకుని ఆ చిన్నారిని అనాథగా చేశారు. మరి..  ఇలాంటి దారుణమైన ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి