iDreamPost

పండగ పూట విషాదం.. నదిలో దూకి ఆత్మహత్య! కారణం తెలిస్తే షాకే..

సంక్రాంతి పండగను ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన ఇద్దరు తోడికొడళ్లు దారుణ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న తోడికొడళ్లలో ఒకరి మృతదేహం లభ్యమైంది.

సంక్రాంతి పండగను ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన ఇద్దరు తోడికొడళ్లు దారుణ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న తోడికొడళ్లలో ఒకరి మృతదేహం లభ్యమైంది.

పండగ పూట విషాదం.. నదిలో దూకి ఆత్మహత్య! కారణం తెలిస్తే షాకే..

అందరూ సంక్రాంతి పండగను ఘనంగా చేసుకుంటూ సంతోషంలో ఉన్నారు. ఊరువాడల్లో పండగ సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే పండగ వేళ పలు ప్రాంతాల్లో విషాదాలు చోటుచేసుకున్నాయి. కొన్ని విధి ఆడిన వింతనాటకంలో చోటుచేసుకుంటే.. మరికొన్ని మాత్రం స్వయం నిర్ణయాలతో చోటుచేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తోడికోడళ్లు ఆత్మహత్య యత్నించారు. ఈ క్రమంలో ఒకరి మృతదేహం లభించగా, మరోకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వారు ఆత్మహత్య చేసుకోవాడానికి గల కారణాలు తెలిసి.. స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పశ్చిమ గోదావిరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన శ్రీను, సాయిశివ అన్నదమ్ములు. వారికి రూపాదేవి, స్వాతి అనే వారితో వివాహం జరిగింది. శ్రీనుకు రూపాదేవి(36)అనే యువతితో వివాహం జరగ్గా, ఆయన తమ్ముడు సాయిశివకు స్వాతి(33)అనే యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. శుక్రవారం నుంచి తోడికోడళ్లు ఇద్దరూ కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదే సమయంలో పెదవేగి పోలీసులకు విజయవాడ పోలీసుల నుంచి ఓ సమాచారం వచ్చింది. ఇద్దరు మహిళలు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించారన్ని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే శనివారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఆత్మహత్యకు యత్నించిన తోడికొడళ్లలో..చిన్నకోడలు స్వాతి మృతదేహం లభించింది. రూపాదేవి ఆచూకీ లభించలేదు. ఆమె కోసం పోలీసులు నది ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు  తోడికొడళ్ల ఆత్మహత్య చేసుకున్నారనే వార్త తెలిసి.. వారి కుటుంబ సభ్యులు.. మృతుల భర్తలైన పాలపాటి శ్రీను, పాలపాటి సాయిశివ ఇళ్లపై దాడి చేశారు. వారి ఇంటి తలుపులు, కిటీకీల అద్దాలను పగులగొట్టారు. అంతేకాక ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈలోపు సమాచారం అందుకున్నపెదవేగి పోలీసులు పినకడిమికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు.

కుటుంబ కలహాల కారణంగానే ఈ ఆత్మహత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థాణకు వచ్చారు. తోడికోడళ్ల ఆత్మహత్యతో పినకడిమిలో ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడటంతో పెదవేగి పోలీులు గ్రామంలో పోలీసు పికెట్ ను ఏర్పాటు చేశారు. డీఎస్పీ, సీఐలు మృతుల గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలకు సర్థి చెప్పారు. అలానే బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరి.. అందరు సంక్రాంతి పండగలో సంతోషంగా ఉంటే.. వీరి కుటుంబాల్లో మాత్రం విషాదం నిండిదిం. మరి.. ఇలాంటి ఆత్మహత్య ఘటనలపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి