iDreamPost

వీడియో: చిలిపి చేష్టలు చేసి చెంపదెబ్బలు తిన్న బడి పంతులు!

వీడియో: చిలిపి చేష్టలు చేసి చెంపదెబ్బలు తిన్న బడి పంతులు!

మన దేశంలో విద్యా వ్యవస్థకు ఎంతో గౌరవ ప్రథమైన స్థానం ఉంది. ఆ విద్యాను అందించే గురువులకు మరింత గౌరవం ఉంది. తమ పిల్లలకు విద్యాబుద్ధులు రావాలని తల్లిదండ్రులు గురువుల వద్దకు పంపుతారు. అలానే గురువులు కూడా తమ వద్దకు వచ్చిన విద్యార్థుల్లోనే అజ్ఞానం తొలగించి.. విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తుంటారు. అందుకే గురువును దేవుడితో సమానంగా పూజిస్తారు. కానీ నేటికాలంలో కొందరు గురువులు.. ఆ స్థానానికి మచ్చ తెస్తున్నారు. కన్నబిడ్డల్లా చూడాల్సిన విద్యార్థులను వక్ర బుద్దితో చూస్తున్నారు. కామంతో కళ్లు గప్పిన కొందరు కీచక బడి పంతుల్లు విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పపడుతున్నారు.  వారికి చెంప దెబ్బలు, చెప్పు దెబ్బల కూడ పడుతున్నాయి.

తాజాగా ప్రకాశంలో జిల్లాలో ఇద్దరు బడి పంతుల్లకు చెంపదెబ్బలు పడ్డాయి. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు రామకృష్ణ.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పుస్తకంలోని పాఠాలు బోధించకుండా.. అసభ్యంగా ప్రవర్తించే వాడు. చాలా రోజుల పాటు అతడి చేష్టాలను ఓపికగా విద్యార్థినులు భరించారు. అతడి ఆగడాలు శృతిమించడంతో పాటు.. అక్కడే పనిచేసే పీఈటీ సార్ కూడ రామకృష్ణకు వత్తాసు పలికాడు. ఈ క్రమంలో విద్యార్థునులు ఇళ్లకు వెళ్లిన సమయంలో ముఖ భావంతో ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు స్కూల్ జరిగే ఘోరం గురించి తెలుసుకున్నారు.

వెంటనే స్కూల్ వెళ్లి.. ఆ కీచక ఉపాధ్యాయుడిని పట్టుకుని బడిత పూజ చేశారు. రెండు చెంపను బూర్రెలాగా వాసేటట్లు దెబ్బలు కొట్టారు. ఆయనకు సహకరించిన పీఈటీకి సైతం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఇద్దరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేశారు. పిల్లలకు చక్కగా విద్యాను నేర్పించి.. మంచి పేరు తెచ్చుకోవాల్సి పోయే.. ఇలాంటి పనులు చేయడం ఏంటనే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కీచక ఉపాధ్యాయులు మరోసారి  ఇలాంటి పనులు చేయకుండా పోలీసులు గట్టిగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ‘మళ్లీ పెళ్లి’ చేసుకున్న పాత జంటలు! అసలు కారణం ఇదే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి