iDreamPost

‘మళ్లీ పెళ్లి’ చేసుకున్న పాత జంటలు! అసలు కారణం ఇదే..

‘మళ్లీ పెళ్లి’ చేసుకున్న పాత జంటలు! అసలు కారణం ఇదే..

సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తిని ఒక్కసారి మాత్రమే పెళ్లి  చేసుకుంటారు. షష్టిపూర్తి సమయంలో మరోసారి పెళ్లి వేడుక నిర్వహిస్తారు. కానీ  ఈ ఘటన చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఓ ప్రాంతంలో కొన్ని జంటలు షష్టిపూర్తి కాకపోయినా మళ్లీ వివాహాలు చేసుకున్నారు. పాతజంటలే మళ్లీ పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే బయట వారికి ఇదే ఆశ్చర్యమే కానీ.. ఆ ప్రాంత వారికి మాత్రం చాలా సాధారణమైన విషయమేనంట. ఇంతకి ఆ ప్రాంత ఎక్కడ?. వాళ్లు అలా చేసుకోవాడనికి గల కారణాలు ఏమిటి?.. ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రకాశం జిల్లా సి.ఎస్.పురం మండలం శీలంవారిపల్లిలో పాత జంటలే కొత్తగా మళ్లీ వివాహం చేసుకొని ఒక్కటైన ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. శీలంవారిపల్లిలో ఎలికా, దుగ్గని వంశస్థుల వారు ఐదు రోజులుగా నాగారపమ్మ తిరునాళ్లను నిర్వహించారు. ఈ తిరునాళ్లకు చుట్టుపక్కల నుంచి భారీగా జనం తరలి వచ్చారు. అమ్మవారి పూజలు నిర్వహించి.. తమ కోర్కెలు కోరుకున్నారు. కొలుపుల ముగింపు సందర్భంగా ఎలికా కుటుంబాల్లో దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తొలిసారి పెళ్లి చేసుకున్నట్లే అన్ని ఏర్పాట్లు చేసుకుని జరుపుకున్నారు. జంటలు పెళ్లి దుస్తులు ధరించి, పూలమాలలు వేసుకొని, తలపాగాలు పెట్టుకుని, బాసికాలతో పెళ్లి పీటలపై కూర్చున్నారు.

పంతులు మంత్రాలు చదువుతుంటే.. ఆ జంటలు నిర్వహించారు. అలా 34 పాత జంటలు మళ్లీ వివాహాలు చేసుకున్నాయి. కొలుపుల్లో పెళ్లిళ్లు చేసుకున్న వారికి, మహిళలు, పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇది ఆనవాయితీగా వస్తోందని స్థానికులు, గ్రామస్థులు తెలిపారు. ఈ వివాహాల ఘట్టాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. శీలంవారిపల్లిలో గ్రామస్థులు నిర్వహించిన ఈ పెళ్లి వేడుకల గురించి తెలిసి.. చుట్టు పక్కల గ్రామాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి.. ఈ వింత పెళ్లిపై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మహిళా రైతుకు అండగా నిలిచిన దిశ యాప్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి