iDreamPost

దేవతలాంటి అమ్మాయిని దారుణంగా ముంచేశాడు! ఏ అమ్మాయికి ఈ స్థితి రాకూడదు!

నేటికాలంలో ప్రేమ అనే పదానికి అర్థాన్ని మార్చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రేమను కామానికి మరో రూపంగా వాడుకుంటున్నారు. శరీర సుఖాలను తీర్చుకునేందుకు కొందరు ప్రేమ అనే పదాన్ని వాడి.. అవసరం తీరిన తరువాత నిండా ముంచేస్తున్నారు.

నేటికాలంలో ప్రేమ అనే పదానికి అర్థాన్ని మార్చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రేమను కామానికి మరో రూపంగా వాడుకుంటున్నారు. శరీర సుఖాలను తీర్చుకునేందుకు కొందరు ప్రేమ అనే పదాన్ని వాడి.. అవసరం తీరిన తరువాత నిండా ముంచేస్తున్నారు.

దేవతలాంటి అమ్మాయిని దారుణంగా ముంచేశాడు! ఏ అమ్మాయికి ఈ స్థితి రాకూడదు!

ప్రేమ.. విన్నడానికి ఇది రెండు అక్షరాల పదమే. దీని కారణంగా ఎంతో మంది వివాహ బంధంలోకి అడుగుపెట్టి సంసారాన్ని హాయిగా సాగిస్తున్నారు. ప్రేమకు నిజమైన అర్థం చెబుతూ నలుగురి ఆదర్శంగా నిలిచిన ప్రేమ జంటలు అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో ప్రేమ అనే పదానికి పూర్తి అర్థం మారిపోయింది. శరీరంపై ఉండే కోరికను తీర్చుకునేందుకు ప్రేమ అనే దానిని వాడుతున్నారు. అవసరం తీరిన..మోసం చేస్తున్నారు. అలా మోసపోయిన యువతులు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రేమ పేరుతో మోసపోయినా  ఓ యువతి కథ విషాదాంతమైంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోక వెళ్తే..

తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా అత్తూరు తాలూకా సాలిపుధూరు గ్రామానికి చెందిన వీరయ్య కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు సూర్య అనే 22 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె గ్రాడ్యూయేట్ పూర్తి చేసి.. చెన్నైలోని  ఓ ప్రైవేటు ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తుంది. ఇదే సమయంలో చెన్నైలో మురుగన్ అనే వ్యక్తి ప్రభుత్వ రవాణా సంస్థలో టికెట్ తనిఖీ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతని అరుణ్ కుమార్ (29)అనే కుమారుడు ఉన్నాడు. అతడు కూడా చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం అరుణ్‌కుమార్‌, సూర్య పరిచయమైంది. అది కాస్తా ప్రేమకు దారితీసింది.

ఈ క్రమంలో గత మూడేళ్లుగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. మురుగన్, వీరయ్యలది ఒకే గ్రామం.  అరుణ్ కుమార్, సూర్య గత ఏడాది కాలంగా చెన్నైలోని కుంరత్తూర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. 4 నెలల క్రితమే సూర్య గర్భం దాల్చినట్లు సమాచారం. పెళ్లి చేసుకోమని కోరగా.. అరణ్ కుమార్ మాటలు దాటేస్తు వచ్చారు.గత ఏప్రిల్‌లో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు అబార్షన్ చేసినట్లు సమాచారం. అతడి ప్రేమ మైకంలో పడిన ఆ యువతి అతడు చెప్పినట్లు గర్భం తీయించుకునేందుకు కూడా సిద్ధమైంది. అంత త్యాగం చేసిన  యువతిని నిండా ముంచేశాడు. అరుణ్‌కుమార్‌కు వేరే యువతితో పెళ్లికి సిద్ధమైనట్లు సూర్య అనే యువతికి తెలిసింది.

ఈ విషయమై సూర్య..అరుణ్‌కుమార్‌ను అడగ్గా.. పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురైన సూర్య బుధవారం రాత్రి ప్రియుడు అరుణ్‌కుమార్ ఇంటి ఎదుట విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.  వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు యువతిని చికిత్స నిమిత్తం దిండిగల్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ప్రేమ పేరుతో మోసపోయిన ఈ యువతి కథ విషాదం మారింది. గతంలోనూ ఎంతో మంది యువతులు ప్రేమ పేరుతో మోసపోయి..మానసిక వేదనకు గురై..ప్రాణాలు తీసుకున్నారు. మరికొందరు యువతులు పిచ్చివాళ్లుగా మారిపోయి..జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.  మరి.. ఇలా ప్రేమ పేరుతో మోసం చేసే వారిని ఏ విధంగా శిక్షించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి