iDreamPost

తల్లితో సాన్నిహిత్యం.. 16 ఏళ్ల ఆమె కూతురిపై CI దారుణం!

  • Published Mar 23, 2024 | 10:10 AMUpdated Mar 23, 2024 | 10:10 AM

ఇటీవల కాలంలో కొందరు పోలీసుల అరాచాకాలు రోజురోజుకి హద్దులు దాటుతున్నాయి. ప్రజలకు అండగా నిలబడి రక్షించాల్సిన ఓ పోలీసు అధికారులే ఒళ్లు మరిచి సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే దేశంలో రోజురోజుకి స్త్రీలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు ఎక్కువైపుతున్న తరుణంలో.. కాపాడవలసిన ఖాకీలే, కామంధుల్లా విరుచుకుపడే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ మధ్యకాలంలో కొందరు పోలీసుల అరాచాకాలు రోజురోజుకి హద్దులు దాటుతున్నాయి. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారి తప్పి సమాజం తలదించుకొనేలా ప్రవర్తిస్తున్నారు. అండగా ఉండవలసిన రక్షకులే.. రాక్షసులా విచక్షణ కోల్పోతున్నారు. దీంతో సామాన్య ప్రజల గోడును తీర్చలసిన పోలీసులే ఇలా నిచామైన పనులకు పాల్పడుతుంటే.. ఇక తమకు రక్షణ కల్పించేది ఎవరూ అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే దేశంలో రోజురోజుకి స్త్రీలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు ఎక్కువైపుతున్న తరుణంలో.. కాపాడవలసిన ఖాకీలే, కామంధుల్లా విరుచుకుపడే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ఒక్కసారిగా నగరమంతా ఊలిక్కిపడింది. అసలు రక్షించల్సినవాడే.. అభం శుభం తెలియని బాలికపై కన్నేసి, కాటేసిన ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రజలకు అండగా నిలబడి రక్షించాల్సిన ఓ పోలీసు అధికారి.. ఒళ్లు మరిచి సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని ఓ 16 ఏళ్ల బాలికపై విచక్షణ కోల్పోయి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణమైన ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. ఈ ఘటన పై ఎస్సై రాజ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్ సీఐగా పని చేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్ లాో ఎస్సైగా పని చేశాడు. ఆ సమయంలో హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో అతడికి పరిచయం ఏర్పడి సన్నిహితంగా మెలిగాడు. అనంతరం అతడు ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయినా ఆ మహిళతో ఆ స్నేహాన్ని కొనసాగించాడు.

దీంతో ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీఆర్ సీఐపై బదిలీ పై వచ్చాడు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సదరు మహిళ కూతురి (16) పై కన్నేశాడు. దీంతో అదను చూసిన ఆ సీఐ ఆ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక విషయం తల్లికి చెప్పడంతో.. ఆమె కెయూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆమె ఇంటికి వెళ్లి విచారణ జరిపిన పోలీసులు సీఐ సంపత్ పై అత్యాచారంతో పాటు పోక్సో చట్టాల కింద హనుమకొండ జిల్లా కేయూ పోలీసు స్టేషన్ కింద కేసు నమోదైయింది. దీంతో నగరంలో కాపాడాలసిన పోలీసు అధికారే ఇలా బాలికపై అత్యచారానికి పాల్పడటం పై అందరూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, కాపాడాలసిన రక్షకుడే, కామంధుడిగా మారి మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి