iDreamPost

అందమైన భార్య.. అంతకన్నా అందమైన కుటుంబం.. కానీ..

ఇటీవల దేశంలో వరుస పరువు హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమను కాదని ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో అమ్మాయి తల్లిదండ్రులు దారుణాలకు తెగబడుతున్నారు.

ఇటీవల దేశంలో వరుస పరువు హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమను కాదని ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో అమ్మాయి తల్లిదండ్రులు దారుణాలకు తెగబడుతున్నారు.

అందమైన భార్య.. అంతకన్నా అందమైన కుటుంబం.. కానీ..

ఈ మద్య యువత చాలా వరకు తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే.. మరికొందరు పెద్దలను ఎదిరించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కొన్నిరోజుల్లోనే విడిపోతున్నారు. ఈ కారంణంతోనే పెద్దలు ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకిస్తుంటారు. కంటికి రెప్పలా కాపాడుకున్న తమ కూతురుని ఎవరో అనామకుడు పెళ్లిచేసుకోవడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పరువు హత్యలకు పాల్పపడిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అలాంటి ఘటనే బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు తంజావూర్ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకుందని ఐశ్వర్య అనే యువతిని తల్లిదండ్రులు, సోదరులు దారుణంగా హింసించి చంపిన ఘటన మరువక ముందే.. బీహార్ లో ఓ ప్రేమ జంటతో పాటు వారి బిడ్డను కూడా సొంత కుటుంబ సభ్యులు హత్య చేసి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలన ప్రకారం.. బీహార్ లోని నౌగాచియా పట్టణం పరిధిలో ఉన్న ఒక గ్రామంలో బుధవారం దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో నౌగాచియా పట్టణం సమీప గ్రామంలో నివిస్తున్న చందన్ కుమార్ అదే గ్రామానికి చెందిన చాందిని కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఊరి నుంచి పారిపోయారు.

A more beautiful family

అందమైన భార్య, అందమైన కుటుంబంతో హ్యాపీగా చందన్ కుమార్ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇటీవల చందన్ కుమార్ తండ్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్త విని తన స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణచించుకున్నాడు. అదే అతని అందమైన కుటుంబాన్ని ఛిదిమేస్తుందని ఊహించలేకపోయాడు. తన తండ్రిని చూసేందుకు చందన్ కుమార్ తన భార్యా, రెండేళ్ల బిడ్డతో కలిసి ఊరికి వచ్చాడు. తన తండ్రిని పరామర్శించి కొంత డబ్బు ఇచ్చాడు. ఈ విషయం చాందిని కుమారి తండ్రి, సోదరులకు తెలియడంతే కోపంతో ఊగిపోయారు. తుపాకులు, ఇనుప రాడ్లు తీసుకొని చందన్ కుమార్ తన కుటుంబంతో తిరిగి వెళ్తుండాగా అడ్డుకొని వారిపై కాల్పులు జరిపి, ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి