iDreamPost

అందుకే…సైనికులే కాదు….కొంతమంది కళాకారులూ గొప్పోల్లే – TNR

అందుకే…సైనికులే కాదు….కొంతమంది కళాకారులూ గొప్పోల్లే – TNR

చాలా మంది నన్ను అడుగుతుంటారు…
మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు అని..?
ఫేవరెట్ హీరో ఎవరన్నప్పుడల్లా ఒక్కో సినిమాలో వాళ్ళ వాళ్ళ నటనని బట్టి ,నా వయసును బట్టి నా పరిస్థితులని బట్టి,నా జీవిత ప్రయాణాన్ని బట్టి ఒక్కో హీరో పేరు చెబుతుండేవాన్ని.
ఒకసారి చిరంజీవనీ,
ఒకసారి అమితాబచన్ అనీ,
ఒకసారి కమలహాసన్ అనీ,
ఒకసారి రజనీకాంత్ అనీ,
ఒకసారి షారూఖ్ ఖాన్ అనీ,
ఒకసారి అజయ్ దేవగన్ అనీ,
ఒకసారి నానాపాటేకర్ అనీ..
ఒకసారి మహేష్ బాబు అనీ,
ఒకసారి పవన్ కళ్యాణ్ అనీ…
ఇలా రకరకాలుగా…

మరి అదే మనుషులు “ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?” అని అడిగినప్పుడు మాత్రం అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడూ నా నుండి తడుముకోకుండా వచ్చే సమాధానం కేవలం శ్రీదేవి అని మాత్రమే.
My one and only all time favourite actress/actor….SRIDEVI.
ఇలాంటి నటి మళ్ళీ పుట్టడం ఇక అసంభవం అని నా అభిప్రాయం.
మీరు ఏ నటీ నటుడిని అయినా తీసుకోండి…
వాళ్ళ పాత సినిమాలను ఒక్కసారి చూడండి…
ఆ సినిమాలలోని వాళ్ళ నటనను ఇప్పుడు చూస్తుంటే అప్పటి పరిస్థితులకు ఆ జెనరేషన్ కి ఆ నటన సరిపోయింది కానీ అదే నటనను ఇప్పటి జెనరేషన్ ఎంజాయ్ చెయ్యలేకపోవొచ్చు అని అనిపిస్తుంది.
కానీ ఒకేఒక్క నటి దానికి అతీతం……… శ్రీదేవి .
శ్రీదేవి నటించిన ఏ సినిమా అయినా తీసుకోండి…అప్పుడెప్పుడో 40 సంవత్సరాల క్రింద చేసిన తన నటన ఇప్పటి జెనరేషన్ కి మ్యాచ్ అయి ఉంటుంది…..ఎట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది.
ఇప్పుడు యంగ్ జెనరేషన్ హీరోయిన్స్ చేసే క్యూట్ పర్ఫార్మెన్స్ తను ఎప్పుడో చేసేసింది,
అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడో ఇచ్చేసింది.
అంత అడ్వాన్స్డ్ పర్ఫార్మెన్స్ ని తను ఎన్నో ఏళ్ళ కిందటే మనకు అందించింది..
సినిమాల్లో తను వేసిన ఏ కాస్ట్యూం అయినా తీసుకోండి…
ఇప్పటి జెనరేషన్ కి ఇప్పటి ఫ్యాషన్ కి అప్ డేట్ అయి ఉంటాయ్.
పాత సినిమాల్లోని శ్రీదేవి పక్కనున్న ఏ నటుల పర్ఫార్మెన్స్ ని అయినా బాగా గమనించండి.
అది పాతకాలం నటనలాగే ఉంటుంది…అది అప్పటి కాలానికి మాత్రమే సూట్ అయ్యే విధంగా ఉంటుంది.
కానీ శ్రీదేవి నటన మాత్రం ఒక హాలీవుడ్ నటి లాగ అప్ డేట్ అయి ఉంటుంది.
అందుకే ఎప్పటికీ బోర్ కొట్టని నటి పద్మశ్రీ శ్రీదేవి మాత్రమే..
నటనని మెరుగుపర్చుకోవాలనుకునే ఈ జెనరేషన్ నటులు శ్రీదేవి సినిమాలు ఖచ్చితంగా చూడాల్సిందే…
శ్రీదేవి సినిమాలంటే ఉచితంగా లభించే ఉన్నతమైన నట శిక్షణాలయాలు.
అలాంటి నటి అర్ధాంతరంగా మరణించడం నాలాంటి కోట్లాదిమంది అభిమానులకు ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయం.
శ్రీదేవి మరణించిన ఈరోజున [ feb 24th ] మన మనసుల్లో ఎప్పటికీ సజీవంగా ఉండే అవిడ రూపాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందామనే ఈ పోస్ట్. –
——————————————————–
[ గమనిక : ఇలాంటి పోస్టులు పెట్టినప్పుడు “వీళ్ళు దేశాన్నేమైనా ఉద్ధరించారా లేక జనలాకేమైనా చేసి చచ్చారా,వాళ్ళేమైనా సరిహద్దులో ఉండే సైనికులా…ఎందుకింత రాద్ధాంతం?” అని కొంతమంది కామెంట్ చేస్తుంటారు .
ఎవరి గొప్పతనం వారిది….
ఒక్కొక్కరు ఒక్కోలా సేవ చెయ్యగలరు…
ఇది కళాసేవ….
ఒక ఇళయరాజా సంగీతం ఆస్వాదిస్తూ ఆస్పత్రి మంచం మీద ఉన్నవాడు ఆనందంగా లేచి కూర్చోవొచ్చు.
ఒక బాలసుబ్రమణ్యం పాట విని ఆత్మహత్య చేసుకునేవాడు కూడా ఆ ప్రయత్నం విరమించుకోవొచ్చు.
ఒక రచయిత రాసిన పుస్తకాన్ని చదివో,ఒక దర్శకుడు తీసిన సినిమాని చూసో ఒక హంతకుడు అన్నీ మానేసి అధ్యాత్మికత వైపు వెళ్ళొచ్చు.
ఒక నటి లేదా నటుడి యొక్క అద్భుతమైన నటన వలన ఒకడి మానవ సంబంధాలు మెరుగుపడొచ్చు.
మనలో జరిగిన ఒక అద్భుతమైన మార్పుకి కారణం ఖచ్చితంగా ఇదీ అని ఒక్కోసారి చెప్పలేం.
ఆ మార్పుకి బీజం ఎక్కడో పడి ఉండొచ్చు…
ఆ బీజానికి కారణం ఒక కళాకారుడై ఉండొచ్చు.
ఒక్కోసారి మనకు అందిన సహాయాలకు ఒక రూపం ఉండకపోవొచ్చు…
కానీ..ఆ సహాయాల వెనకాల అందమైన రూపం ఉన్న ఇలాంటి శ్రీదేవిలు ఎంతోమంది ఉండొచ్చు.
అందుకే…సైనికులే కాదు…కొంతమంది కళాకారులూ గొప్పోల్లే …
అందుకే…
I respect art..
I respect cinema..
I respect & I love sreedevi …❤ – TNR ]
—————————————————————————
[ అతి ముఖ్య గమనిక : ఈ పోస్ట్ వేరే నటీనటుల అభిమానులను బాధపెట్టి ఉంటే నా క్షమాపణలు.
ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ] – TNR ]

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి