iDreamPost

Titan: టైటాన్ రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం.. బిలియనీర్లు మృతి!

Titan: టైటాన్ రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం.. బిలియనీర్లు మృతి!

టైటానికి శిథిలాలను చూసేందుకు టైటాన్ సబ్ మెర్సిబుల్ లో వెళ్లిన ఐదుగురు బిలియనీర్ల ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. వారి కోసం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతమైంది. వారంతా ప్రాణాలతో లేరంటూ అధికారులు వెల్లడించారు. ఐదుగురు ప్రయాణికులతో గత ఆదివారం కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి బయల్దేరిన టైటాన్ సబ్ మెర్సిబుల్ అట్లాంటిక్ సముద్రంలో తప్పిపోయింది.

నీటిలోకి ప్రవేశించిన గంటా 45 నిమిషాలకే టైటాన్ భూఉపరితలం నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. అంతేకాకుండా అదే సమయంలో నేవిగేషన్ సిస్టమ్ కూడా క్రాష్ అయింది. ఇలా కామ్ కనెక్షన్, నేవిగేషన్ ఒకేసారి కోల్పోవడంతో అప్పుడే జరగకూడనిది జరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఆ టైటాన్ సబ్ మెర్సిబుల్ కేవలం 96 గంటల ఆక్సజన్ నిల్వతోనే సముద్రంలోకి దిగింది. జాడ కోల్పోయినప్పటి నుంచి అధికారలు కాలంతో పోటీ పడుతూ రెస్క్యూ ఆపరేషన్ ని ముందుకు తీసుకెళ్లారు.

అయితే వారి ప్రయత్నాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయాయి. రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ టైటాన్ భాగాలను కనుగొన్నట్లు అమెరకా కోస్ట్ గార్డ్ అధికారులు ప్రకటించారు. టైటానికి ఓడ శిథిలాలకు సమీప దూరంలోనే టైటాన్ భాగాలను గుర్తించామన్నారు. సముద్ర గర్భంలో ఉండే పీడనానికి తట్టకోలేక టైటాన్ సబ్ మెర్సిబుల్ పేలిపోయినట్లు అధికారలు తెలిపారు. ఈ టైటాన్ సబ్ మెర్సిబుల్ లో ప్రయాణించిన.. ఓషన్ గేట్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టాక్టర్ రష్, పాకిస్తాన్ బిలియనీర్ షెహజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19), బ్రిటన్ వ్యాపారవేత్త హమీష హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నేవీ అధికారి పాల్ హెన్రీ ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించారు.

ఈ యాత్ర కోసం ఓషన్ గేట్ కంపెనీ మొత్తం 2.5 లక్షల డాలర్లను ఛార్జ్ చేస్తుంది. అంటే మన కరెన్సీలో రూ.2 కోట్లకు పైనే ఉంటుంది. ఈ సబ్ మెర్సిబుల్ ఐదుగురు వ్యక్తులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. 1912లో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను 1985లో కనుగొన్నారు. అవి అట్లాంటిక్ సముద్రం అడుగున.. భూఉపరితలానికి 3800 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈ యాత్రలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు బిలియనీర్లు క్షేమంగా తిరిగిరావాలంటూ కోరుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి