iDreamPost

తిరుపతి జిల్లాలో భూకంపం.. భయంతో రోడ్ల మీదకు జనం పరుగులు!

  • Published Mar 14, 2024 | 10:08 PMUpdated Mar 14, 2024 | 10:10 PM

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లాలో భూకంపం సంభవించింది. ఒకేసారి భూమి కంపించడంతో జనం భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లాలో భూకంపం సంభవించింది. ఒకేసారి భూమి కంపించడంతో జనం భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.

  • Published Mar 14, 2024 | 10:08 PMUpdated Mar 14, 2024 | 10:10 PM
తిరుపతి జిల్లాలో భూకంపం.. భయంతో రోడ్ల మీదకు జనం పరుగులు!

ప్రకృతి వైపరీత్యాలు మిగిల్చే నష్టం అంతా ఇంతా కాదు. వాటి వల్ల తీవ్ర స్థాయిలో ధన, ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. అందుకే వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు అంటే చాలు ప్రజలు భయపడిపోతారు. ఇలాంటి వైపరీత్యాల వల్ల సొంత వాళ్లను కోల్పోయిన ప్రజలు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్​లో గురువారం భూకంపం సంభవించింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో ఇది చోటుచేసుకుంది. దొరవారి సత్రం, నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో చాలా ఇళ్లలోని సామాన్లు కింద పడ్డాయి.

భూకంపం తీవ్రతకు కొన్ని ఇళ్లలో గోడలకు భారీ పగుళ్లు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భూమి కంపించగానే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ టైమ్​లో భూమి కంపించడంతో పాటు భారీ శబ్దం కూడా వచ్చిందని అంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పలు చోట్ల సిమెంట్ రోడ్లకు బీటలు వచ్చాయని తెలిపారు. గతంలోనూ తమ జిల్లాలో పలుమార్లు భూకంపం వచ్చిందని, ఇలా భూమి కంపించిన ప్రతిసారి తాము భయాందోళనకు గురవుతున్నామని చెబుతున్నారు. అయితే తిరుపతి జిల్లాలో సంభవించిన తాజా భూకంపం తీవ్రత ఎంత అనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: పిఠాపురంలో TDPకి అసమ్మతి సెగ.. పవన్ గో బ్యాక్ అంటూ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి