iDreamPost

థైరాయిడ్‌కు దివ్యౌషధం.. ఈ ఆకుతో సమస్యకు శాశ్వత పరిష్కారం

  • Published Nov 14, 2023 | 12:33 PMUpdated Nov 14, 2023 | 12:33 PM

ప్రస్తుత కాలంలో అత్యధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య థైరాయిడ్‌. దీనికి ఆయుర్వేదంలో మంచి ఔషధం ఉంది అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు..

ప్రస్తుత కాలంలో అత్యధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య థైరాయిడ్‌. దీనికి ఆయుర్వేదంలో మంచి ఔషధం ఉంది అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు..

  • Published Nov 14, 2023 | 12:33 PMUpdated Nov 14, 2023 | 12:33 PM
థైరాయిడ్‌కు దివ్యౌషధం.. ఈ ఆకుతో సమస్యకు శాశ్వత పరిష్కారం

ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న అనారోగ్య సమస్య.. థైరాయిడ్‌. నేడు మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నట్లు రిపోర్ట్స్‌ వెల్లడిస్తున్నాయి. ఈ సమస్య మగవారి కన్నా ఆడవారిలోనే అధికం. అసలు ఏంటి ఈ థైరాయిడ్‌ అంటే.. మనిషి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆ​కారంలో ఉండే గ్రంథిని థైరాయిడ్‌ గ్రంథి అంటారు. దీని నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీద ఉంటుంది.

ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే దాన్ని హైపో థైరాయిడ్ అని, అధికంగా ఉంటే హైపర్ థైరాయిడ్ అని అంటారు. ఈ సమస్య బారిన పడితే అధికంగా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. దీనికి మందులు ఉన్నప్పటికి.. ఆయుర్వేదంలో మంచి ఔషధం ఒకటి ఉంది. దాంతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకు ఏంటా ఔషధం అంటే..

థైరాయిడ్‌ బారినపడ్డ వారికి దివ్యౌషధం సరస్వతి ఆకులు. వీటి ద్వారా తయారు చేసిన మందుతో థైరాయిడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని.. దీని వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకు సరస్వతి ఆకుతో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే..

సరస్వతి ఆకుతో మాత్రలు ఎలా తయరుచేసుకోవాలంటే..

  • మొదట సరస్వతి ఆకులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి.
  • తర్వాత వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోండి.
  • ఈ పేస్ట్‌ గట్టిగా ఉంటే.. కొంచం నీళ్లు కలుపుకోవాలి.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 130 గ్రాములు అంటే వేరుశనగ గింజ సైజులో మాత్రలుగా చేసుకోవాలి.
  • అనంతరం వీటిని నీడలో ఆరబెట్టి.. గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

తీసుకునే విధానం..

  • ఈ టాబ్లెట్ వేడి నీటితో భోజనానికి ముందు రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.
  • వీటిని క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తంలో టీ4 హార్మోన్ స్థాయి పెరిగి హైపోథైరాయిడ్ కంట్రోల్‌ అవుతుంది.
  • మీరు థైరాయిడ్‌ కోసం వేరే మందులు వాడుతున్నప్పటికీ.. ఈ మాత్రలు తీసుకుంటే.. రక్తంలో టీ 4 హార్మన్‌ స్థాయిలు పెరుగుతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఈ మాత్రల వల్ల ఇతర ప్రయోజనాలు..

  • ఈ మాత్రలు వినియోగించడం వల్ల తెలివితేటలు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
  • ఈ ట్యాబ్లెట్స్‌ తీసుకోవడం వల్ల.. రక్తం శుద్ధి అవుతుంది. రక్త హీనత సమస్య కూడా దూరం అవుతుందని తెలిపారు.
  • మాన‌సిక ఒత్తిడి, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఈ మాత్రలు ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు

సరస్వతి ఆకులో ఉన్న ఇతర పదార్థాలు..

సరస్వతి ఆకులో ఎసిటిక్ యాసిడ్, ఎసిటమైడ్, బ్రాహ్మణిసైడ్ వంటి రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో టీ4 హార్మోన్ స్థాయిని పెంచుతుంది. కనుక సరస్వతి ఆకు థైరాయిడ్‌ సమస్యను పరిష్కరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి