iDreamPost

పండుగ నాడు తల్లిదండ్రుల వద్దకు.. అంతలోనే తీరని విషాదం

దసరా వస్తుందంటే..పెద్దలకన్నా, పిల్లలకే మిక్కిలి సంతోషం. వారం రోజుల పాటు పుస్తకాల జోలికి వెళ్లనక్కర్లేదు. స్కూల్ ముఖం చూడనక్కర్లేదు. బంధువులు మన ఇంటికి వస్తారు. మనం చుట్టాల ఇంటికి వెళ్లొచ్చు. నాన్నమ్మ, తాతయ్య, తల్లిదండ్రులతో ఆడుకోవచ్చు. అలా అనుకున్నారు వీరు కూడా..

దసరా వస్తుందంటే..పెద్దలకన్నా, పిల్లలకే మిక్కిలి సంతోషం. వారం రోజుల పాటు పుస్తకాల జోలికి వెళ్లనక్కర్లేదు. స్కూల్ ముఖం చూడనక్కర్లేదు. బంధువులు మన ఇంటికి వస్తారు. మనం చుట్టాల ఇంటికి వెళ్లొచ్చు. నాన్నమ్మ, తాతయ్య, తల్లిదండ్రులతో ఆడుకోవచ్చు. అలా అనుకున్నారు వీరు కూడా..

పండుగ నాడు తల్లిదండ్రుల వద్దకు.. అంతలోనే తీరని విషాదం

దసరా అంటేనే సరదాగా సాగిపోయే పండుగ. ఇక చిన్న పిల్లలకైతే మరింత ఆనందాన్ని ఇస్తుంది . సెలవులు వస్తాయి కాబట్టి.. అమ్మమ్మ, నాన్నమ్మల ఇంటికి వెళ్లొచ్చని భావిస్తుంటారు. వారం నుండి 10 రోజుల పాటు పుస్తకాలు పట్టుకోవనక్కర్లేదన్న సంతోషంతో ఉంటారు. ఇంటి దగ్గర స్నేహితులతో ఎంచక్కా ఆడుకోవచ్చునని, కొత్త బట్టలు కట్టుకోవచ్చునని, రక రకాల పిండి పదార్ధాలు తినవచ్చునని ఆశపడుతుంటారు. అందుకే విజయ దశమి ఎప్పుడు ఎప్పుడూ వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తుంటారు. అందరి పిల్లల్లాగే ఈ పిల్లలు దసరా సెలవుల కోసం ఎదురు చూశారు. సెలవులు ఇవ్వగానే.. రెక్కలు విప్పిన పక్షుల్లా తల్లిదండ్రుల చెంతకు వెళ్లారు.

పండుగ వేళ ఆడుకుంటుండగా.. రైలు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్ పట్టులో చోటుచేసుకుంది. ఉరపక్కం రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదాన్ని ఈ ముగ్గురు చిన్నారులు గ్రహించలేకపోవడానికి కారణం.. వీరూ మూగ, చెవిటి బాలురు కావడం విచారకరం. మృతుల్ని సురేష్(15), రవి (12), మంజునాథ్ (11)లుగా గుర్తించారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు.. దసరా సెలవులు ఇవ్వడంతో ఉరపక్కంలో కూలీలుగా పని చేస్తున్న తల్లిదండ్రులను చూసేందుకు వచ్చారు. తల్లిదండ్రులతో గడిపి.. తిరిగి సొంతూరుకు వెళ్లిపోవాలనుకున్నారు.

దసరా పండుగ రోజున నివాసానికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వెంట ఆడుకుంటున్నారు. రైలు ట్రాకులు దాటుతుండగా.. వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. పాండి బీచ్-చెంగల్పట్టు మధ్య తిరిగే లోకల్ ట్రైన్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందారు ముగ్గురు బాలురు. లోకో పైలట్ హారన్ వేసినా కూడా.. వీరు చెవిటి, మూగ కావడంతో గ్రహించలేకపోయారని, రైలు రావడాన్ని చూసిన తల్లిదండ్రులు కూడా పిల్లలను అప్రమత్తం చేశారని, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సెలవులకు వచ్చిన పిల్లల్ని తనివి తీరా చూసుకోకుండా.. మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి