iDreamPost

దిల్ రాజుకి బెదిరింపులు.. హనుమాన్ కోసం విశ్వ హిందూ పరిషత్ రంగంలోకి!

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. గుంటూరుకారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగ వస్తున్నాయి. అయితే తీవ్ర పోటీ నెలకొంది మాత్రం హనుమాన్, గుంటూరు కారం మధ్యే. ఎందుకంటే.. ఈ రెండు జనవరి 12నే థియేటర్లలోకి వస్తున్నాయి.

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. గుంటూరుకారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగ వస్తున్నాయి. అయితే తీవ్ర పోటీ నెలకొంది మాత్రం హనుమాన్, గుంటూరు కారం మధ్యే. ఎందుకంటే.. ఈ రెండు జనవరి 12నే థియేటర్లలోకి వస్తున్నాయి.

దిల్ రాజుకి బెదిరింపులు.. హనుమాన్ కోసం విశ్వ హిందూ పరిషత్ రంగంలోకి!

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్‌గా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు సక్సెస్ ఫుల్ నిర్మాతగా మారింది. ఈ సంక్రాంతికి కూడా బరిలోకి దిగుతున్నాడు. అయితే నిర్మాణ పరంగా కాదూ.. డిస్ట్రిబ్యూటర్‌గా. మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం నైజాం హక్కులను దిల్ రాజు కొనుగోలు చేసిన సంగతి విదితమే. అయితే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలు. ఈ పండుగ రేసులోనే పరిగెడుతున్నాయి తేజ సజ్జా హనుమాన్, మహేష్ గుంటూరు కారం, వెంకీ మామ సైంధవ్, నాగార్జున నా సామి రంగ వస్తున్నాయి. ఈగల్ తప్పుకుంది.

దీనికి కారణం దిల్ రాజు అని తెలిసింది. ఆయన మంతనాలు చేయడం వల్లే ఈగల్ తప్పుకుందని తెలుస్తోంది. అదే సమయంలో నైజాంలో సింగిల్ స్క్రీన్లన్నీ దిల్ రాజు లాక్ చేశాడు. దీంతో హనుమాన్ కు థియేటర్లు దక్కడం లేదు. ఈ విషయంపై దిల్ రాజుకు బెదిరింపులు వస్తున్నాయట. హనుమాన్ కోసం విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దిల్ రాజుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట. ‘దేవుడితో పెట్టుకోకు .. హనుమాన్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వు లేదంటే లీగల్ నోటీసులు పంపుతాం’ అంటూ అల్టిమేటం జారీ చేశారట. దీంతో దిల్ రాజు సమస్యల్లో పడ్డారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమే అయితే.. దిల్ రాజు స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ-తేజా సజ్జా కాంబోలో రాబోతున్న మూడవ మూవీ హనుమాన్. పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన ఈ మూవీ కూడా పలు మార్లు వాయిదా పడుతూ సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. జనవరి 12న విడుదల తేదీని ప్రకటించింది. ఇదే సమయంలో మహేష్ బాబు-తివిక్రమ్ కాంబోలో  వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం కూడా ఇదే రోజు విడుదల అవుతుంది. వీటికి తోడు బడా హీరోస్ మూవీస్ ఉండనే ఉన్నాయి. అయితే ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే.. దానికి తగ్గట్లు పావులు కదిపారు. గుంటూరు కారం డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు మహేష్ సినిమాకు సింగిల్ స్క్రీన్లన్నీ లాక్ చేసేశాడు. అలాగే అతడే స్వయంగా రంగంలోకి దిగి ఈగల్ మూవీని ఓ అగ్రిమెంట్ మీద పోస్ట్ పోన్ చేయించారని టాక్. దీంతో ఎన్నో ఆశలతో, అంచనాలతో దిగుతున్న హనుమాన్ మూవీకి థియేటర్లు దొరకడం తలనొప్పిగా మారింది. దీనిపై దిల్ రాజుకు కూడా నెగివిటీ వచ్చింది. అతడిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా బెదిరింపులే వచ్చినట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి