iDreamPost

వీడియో: సామ్ కరణ్ ను ఉతికారేసిన శ్రేయాస్ అయ్యర్.. ఒకే ఓవర్లో చితకొట్టేశాడు..!

Shreyas Iyer vs Sam Curran: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ విజృంభించింది. ఆ మైదానంలోనే ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ పోరాటం బాగుంది.

Shreyas Iyer vs Sam Curran: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ విజృంభించింది. ఆ మైదానంలోనే ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ పోరాటం బాగుంది.

వీడియో: సామ్ కరణ్ ను ఉతికారేసిన శ్రేయాస్ అయ్యర్.. ఒకే ఓవర్లో చితకొట్టేశాడు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో.. కేకేఆర్ ప్లేయర్లు మరోసారి విజృంభించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు కేకేఆర్ బ్యాటర్లను ఏ మాత్రం నిలువరించలేకపోయారు. మొదటి ఓవర్ నుంచి సునీల్ నరైన్- ఫిలిప్ సాల్ట్ జోడీ కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ ఇద్దరి దెబ్బకు స్కోర్ బోర్డ్ 300కి చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ, తర్వాత నరైన్(71), సాల్ట్(75)కు అవుట్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ కాస్త రిలాక్స్ అవుతున్న సమయంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దెబ్బకు కరణ్ కాస్ కంగారు పడ్డాడు.

కేకేఆర్ ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారీ స్కోర్స్ లక్ష్యంగా పక్కా ప్రణాళికతో అటాకింగ్ మోడ్ లో ఆడుతున్నారు. ముఖ్యంగా క్రీజులోకి వచ్చింది మొదలు నరైన్ విజృంభిస్తూనే ఉన్నాడు. పంజాబ్ తో మ్యాచ్ లో కూడా కేవలం 32 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. నరైనే అల్లాడిస్తున్నాడు అంటే.. అదర్ ఎండ్ లో ఉన్న సాల్ట్ కూడా ఊపందుకున్నాడు. కేవలం 37 బంతుల్లోనే 6 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో ఏకంగా 75 పరుగులు చేసేశాడు. వీళ్లిద్దరు పెవిలియన్ చేరిన తర్వాత పంజాబ్ బౌలర్లు కాస్త కుదుట పడ్డారు. కానీ, ఆ తర్వాత అయ్యర్ల జోడీ తగులుకుంది. అప్పటికే క్రీజులో ఉన్న వెంకటేశ్ అయ్యర్ కు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తోడయ్యాడు. ఇంకేముంది స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

సామ్ కరణ్ వేసిన ఒక ఓవర్లో కెప్చెన్ వర్సెస్ కెప్టెన్ ఆసక్తికర పోరు జరిగింది. ఆ ఓవర్లో పంజాబ్ కెప్టెన్ సామ్ కరణ్ ను కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చితకొట్టేశాడు. ఓవర్లో ఆఖరి నాలుగు బంతులను 6, 4, 6, 6తో విజృంభించాడు. అయితే ఆ తర్వాత ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ అవుట్ గా పెవిలిచన్ చేరాడు. భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో అయ్యర్ కేవలం 10 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. మొత్తానికి ఈ మ్యాచ్ లో కూడా కేకేఆర్ జట్టు అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ మ్యాచుల్లో అత్యధిక స్కోర్ ను కేకేఆర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 261 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు అర్షదీప్ సింగ్ కు 2 వికెట్లు, సామ్ కరణ్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ లకు తలో వికెట్ దక్కింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి