iDreamPost

ఒకటే తేదీ రెండు బ్లాక్ బస్టర్స్

ఒకటే తేదీ రెండు బ్లాక్ బస్టర్స్

ఒకప్పుడు ఏమో కానీ టెక్నాలజీ పెరిగిపోయి ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాక యానివర్సరీ ట్రెండ్లు ఊపందుకున్నాయి. గతంలో ఆడేసి చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తాలూకు జ్ఞాపకాలు, రికార్డులు పోస్టర్లతో అభిమానులు వాటినో ఉత్సవంలా జరుపుకునే పోకడ ఇటీవలి కాలంలో బాగాపెరిగిపోయింది. నిన్న మెగా ఫ్యాన్స్ కు ఏకంగా రెండు సందర్భాలు దొరకడంతో వాళ్ళ ఆనందం మాములుగా లేదు. మొదటిది 2002లో వచ్చిన చిరంజీవి ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రికార్డుల బూజు దులిపి బెంచ్ మార్క్ గా నిలిచిపోయింది.

2002 జూలై 24న విడుదలైన ఈ మెగా మూవీ 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్ బాగానే రచ్చ చేశారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కె ప్రారంభోత్సవంలో బిజీగా ఉన్న వైజయంతి మూవీస్ యూనిట్ ఈ విషయాన్ని లైట్ తీసుకోవడంతో కనీసం ఒక్క ట్వీట్ కూడా లేకపోవడం పట్ల అభిమానులు ట్విట్టర్ లో నిరసన ప్రకటించారు. గత ఏడేళ్లుగా ఇది శాటిలైట్ ఛానల్స్ లో టెలికాస్ట్ కావడం లేదు, అఫీషియల్ గా మంచి ప్రింట్ తో ఏ యూట్యూబ్ ఛానల్ లో లేదు. ఇది కూడా వాళ్ళ ఆగ్రహానికి ఒక కారణంగా చెప్పొచ్చు. వీటి సంగతి ఎలా ఉన్నా ఇంద్ర చిరంజీవికి ఒక మెమొరబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మాట వాస్తవం.

ఇక రెండోది 1998 జులై 24న రిలీజైన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో రెండు వందల రోజులకు పైగా ప్రదర్శింపబడి సింగల్ స్క్రీన్ లో అతి తక్కువ టైంలో కోటి రూపాయలు వసూలు చేయడం అప్పట్లో సెన్సేషన్. పవన్ తర్వాత దీన్ని మించిన రికార్డులు సృష్టించినప్పటికీ తొలిప్రేమ మాత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సందర్భాన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ వైరల్ చేశారు. తొలిప్రేమ తాలూకు మెమెరీస్ తో సోషల్ మీడియాని నింపేశారు. ఇలా ఒకే డేట్ ని రెండు సినిమాల తాలూకు ట్రెండ్ జరగడం అరుదు కాదు కానీ ఆ రెండూ అన్నదమ్ములవి కావడం మాత్రం ఖచ్చితంగా విశేషమే

Also Read: మేజిక్ చేసిన తొలిప్రేమ – Nostalgia

Also Read: చరిత్ర సృష్టించిన ‘ఇంద్ర’ ప్రస్థానం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి