iDreamPost

ఈ వారం ఓటిటి లవర్స్ కి పండగే! ఏకంగా స్ట్రీమింగ్ కి 14 మూవీస్!

  • Author ajaykrishna Published - 02:19 PM, Tue - 18 July 23
  • Author ajaykrishna Published - 02:19 PM, Tue - 18 July 23
ఈ వారం ఓటిటి లవర్స్ కి పండగే! ఏకంగా స్ట్రీమింగ్ కి 14 మూవీస్!

ఓటిటి ప్రేక్షకులకు ప్రతీ వారం పండగే అవుతుంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. సంఖ్య పరంగా గతవారాల కంటే కాస్త తక్కువ అయినప్పటికీ.. చాలా ఇంటరెస్టింగ్ సినిమాలు, సిరీసులు వస్తున్నాయి. మిమ్మల్ని అలరించడంలో ఏమాత్రం తగ్గకుండా ఓటిటి వేదికలు సిద్ధం అవుతున్నాయి. అయితే.. ఇంతకుముందులా కాకుండా ఓటిటి సినిమాలు ఫ్రై డే రూల్ పాటించకుండా.. మధ్యలోను రిలీజ్ చేస్తున్నాయి. కాబట్టి.. మీరు కోరుకునే ఎంటర్టైన్మెంట్ కి ఎటువంటి భంగం కలిగే ఛాన్స్ లేదు. అలాగని ఫ్రైడే వరకు కొత్త సినిమాల కోసం వెయిట్ చేసే అవసరం మీకు కూడా లేదు.

ఇక ఆల్రెడీ ఉన్న పాపులర్ ఓటిటి వేదికలతో పాటు పలు కొత్త ఓటిటిలు సైతం కొత్త సినిమాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వారం క్రేజ్ పరంగా ఆడియన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్న మూవీస్ లో స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వరల్డ్.. ఇది యానిమేషన్ మూవీ అయినా.. స్పైడర్ మ్యాన్ సిరీస్ లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. అలాగే క్రేజీ పెయిర్ వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన బవాల్ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక డైరెక్ట్ తెలుగు సినిమాలు అయితే.. డిజిటల్ స్ట్రీమింగ్ కి ఇప్పటికైతే ఖరారు కాలేదు. మరి ఈ వారం ఓటిటిలో సందడి చేయనున్న మూవీస్ ఏంటో చూద్దాం!

ఈ వారం స్ట్రీమింగ్ కి సిద్ధమైన 14 సినిమాలు..

నెట్‌ఫ్లిక్స్‌:

  • అన్నోన్: కేవ్ ఆఫ్ బోన్స్ (ఇంగ్లీష్) – (స్ట్రీమింగ్)
  • ది డీపెస్ట్‌ బ్రెత్‌ (ఇంగ్లీష్) – జులై 19
  • స్వీట్‌ మంగోలియాస్‌ (సీజన్ 3) – జులై 20
  • దే క్లోన్‌డ్‌ టైరోన్‌ (ఇంగ్లీష్) – జులై 21

అమెజాన్ ప్రైమ్:

  • బవాల్ (హిందీ) – జూలై 21

జీ5:

  • ఎస్టేట్ (తమిళ్) – జూలై 16
  • స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ – జూలై 18
  • సీతారామ – కన్నడ (స్ట్రీమింగ్)

జియో సినిమా:

  • ట్రయల్ పీరియడ్ (హిందీ) – జూలై 21
  • స్పెషల్ ఒప్స్: లయనెస్ – జూలై 23

సోనీలివ్:

  • అబోల్ ప్రీతీచి అజబ్ కహాని – మరాఠీ (స్ట్రీమింగ్)
  • గ్రేట్ సిటీస్ ఆఫ్ ది వరల్డ్ – ఇంగ్లీష్ (స్ట్రీమింగ్)

సన్ నెక్స్ట్:

  • క్షేత్రపాల్ శ్రీ దేవ్ వేటోబ – మరాఠీ (స్ట్రీమింగ్)

డాక్యూ బే:

  • అబోవ్ అండ్ బియాండ్ – ఇంగ్లీష్ – జులై 21

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి