iDreamPost

ఇది నయా మోసం.. రూ. 3 కోట్లతో ఉడాయించిన దంపతులు

మోసపోయిన వాళ్లు ఉన్నంత కాలం చీట్ చేస్తూనే ఉంటారు కేటుగాళ్లు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. వీరి మాటల గారడికిి బుట్టలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు కొొందరు. తాజాగా...

మోసపోయిన వాళ్లు ఉన్నంత కాలం చీట్ చేస్తూనే ఉంటారు కేటుగాళ్లు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. వీరి మాటల గారడికిి బుట్టలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు కొొందరు. తాజాగా...

ఇది నయా మోసం.. రూ. 3 కోట్లతో ఉడాయించిన దంపతులు

‘కాదేదీ మోసానికి అనర్హం’ అన్న చందంగా మారిపోయింది కేటుగాళ్ల తీరు. జల్సాలకు అలవాటు పడి, అప్పులు పాలై జనాలను ముంచేస్తున్నారు కొందరు. డబ్బు సంపాదనే పరమావధిగా అడ్డ దారులు తొక్కుతున్నారు. దేశంలో ఇలాంటి మోసాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. జనాలు కూడా ఊరికనే దుడ్డు వస్తుందంటే.. అప్పు తెచ్చి మరీ పెట్టుబడి పెడుతుంటారు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’.. చీటింగ్ జరిగిందని తెలిశాక.. లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి మోసమే ఒకటి బయటకు వచ్చింది. ఈ సారి ఏకంగా బ్యూటీ పార్లర్ ముసుగులో ఈ వ్యవహారం సాగింది. తాజా ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో ఏకంగా రూ. 3 కోట్లను జనాల నుండి వసూలు చేసి.. వాటితో ఉడాయించారు దంపతులు. చివరకు తాము మోసపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి నగర్‌ ప్రధాన కార్యాలయంగా సమీనా, ఇస్మాయి, జెస్సికా (మరదలు) కలిసి.. ఓ నకిలీ బ్యూటీ పార్లర్ స్థాపించారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో యాడ్స్ చేశారు. ఫ్రాంచైజీ తీసుకుంటే.. నెలకు 35 వేల జీతం ఇస్తామని మాయమాటలు చెప్పారు భార్యా భర్తలు సమీనా, ఇస్మాయిల్. ఆకర్షణీయంగా ప్రకటనలు చేసి కస్టమర్లను పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఈ యాడ్స్ కు ఎట్రాక్ట్ అయ్యి.. కొంత మంది వీరిని కాంటాక్ట్ అయ్యారు. అలా వారి వద్దకు వచ్చిన కస్టమర్లను తమ మాటలతో బురిడీ కొట్టించి.. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడులు పెడితే..డబుల్, త్రిబుల్ డబ్బులు రిటర్న్ ఇస్తామంటూ నమ్మ బలికారు.

 ఈ మాటలు నమ్మి.. అనేక మంది డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అలా ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంఛైజీ కోసం రూ. 3 లక్షల 20 వేల వరకు ఒక్కొక్కరి నుండి వసూలు చేశారు. అలా 100కి పైగా ఓపెన్ చేశారు. తొలి రెండు నెలలు వాళ్లు చెప్పినట్లే కొంత జీతం కూడా ఇచ్చారు. కానీ మొత్తం 3 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఎంతకు వాళ్ల ఆచూకీ గురించి తెలియకపోవడంతో చివరకు మోసపోయామని గుర్తించి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బాధితులే ఎక్కువని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దంపతుల కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసి పారిపోయినట్లు తేలింది. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి