iDreamPost

పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఈ పాప.. ఆ స్టార్ హీరో కూతురు

ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ చేతిలో కనిపిస్తున్న ఈ పాప ఎవరో తెలుసా.. ఒక స్టార్ హీరో కూతురు. పవన్ చిరు నవ్వులు చిందిస్తుంటే.. అలా ఫోటో వంక తదేకంగా చూస్తున్న ఈ చిన్నారి ఎవరి గారాల పట్టి అంటే..?

ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ చేతిలో కనిపిస్తున్న ఈ పాప ఎవరో తెలుసా.. ఒక స్టార్ హీరో కూతురు. పవన్ చిరు నవ్వులు చిందిస్తుంటే.. అలా ఫోటో వంక తదేకంగా చూస్తున్న ఈ చిన్నారి ఎవరి గారాల పట్టి అంటే..?

పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఈ పాప.. ఆ స్టార్ హీరో కూతురు

మా హీరో గ్రేట్ అంటే మా హీరో తోపు అంటూ ఫ్యాన్స్ కొట్టుకుంటారు కానీ.. ఇండస్ట్రీలోని టాప్ హీరోలంతా మంచి ఫ్రెండ్స్. ఒక హీరో ఇంట్లో ఫంక్షన్, పార్టీ జరుగుతుందంటే.. మిగిలిన హీరోలు సినిమా షూటింగ్స్ ఆపుకుని మరీ వెళ్లి హాజరువుతుంటారు. అలాగే ఒక హీరో ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మరో హీరో ముఖ్య అతిధిగా వచ్చి ఆశ్చర్యపరుస్తుంటారు. మాదంతా ఒకటే కుటుంబం అని నిరూపిస్తుంటారు. సినిమా పరంగా వారిది హెల్తీ కాంపిటీషన్ కానీ.. వ్యక్తిగతంగా వారంతా కలిసి మెలిసి కుటుంబ సభ్యుల్లాగే ఉంటారు. స్టార్ హీరో పిల్లలు సైతం ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. ఆ హీరో పిల్లలు, ఈ హీరో పిల్లలకు కూడా మంచి బంధం కొనసాగుతూ ఉంటుంది.

ఇదిగో ఈ ఫోటోలో చూశారు కదా.. పవన్ కళ్యాణ్ చేతిలో ఒద్దికగా ఒదిగి కూర్చున్న పాప ఎవరో తెలుసా..? ఆ పాప పవన్ కళ్యాణ్ ఆద్య అనుకుంటున్నారేమో కాదూ.. ప్రముఖ హీరో కూతురు. ఇండస్ట్రీలో ఎన్నో స్ట్రగుల్స్ పడి.. ఫ్రెండ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రలు పోషించి.. హీరోగా ఎదిగాడు ఆ పాప డాడీ. తన ఈజీ గోయింగ్ నటనతో మెస్మరైజ్ చేస్తుంటాడు. అంతేకాదూ..అతడికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే అతడికి అలాంటి బిరుదే ఉంది. ఇంతకు ఆ నటుడు ఎవరంటే.. మాస్ మహారాజ్ రవితేజ. పవన్ కళ్యాణ్ చేతిలో కూర్చొన్న ఈ అమ్మాయి రవితేజ కూతురు మోక్షద. రవితేజకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. కొడుకు మహదేవన్, కూతురు మోక్షద.

రవితేజ గురించి, ఆయన సినిమాల గురించి తెలుసు కానీ.. ఫ్యామిలీ గురించి పెద్దగా మాట్లాడడు. వాళ్లు కూడా బయట ఎక్కడా కనిపించరు. రవితేజ భార్య పేరు కళ్యాణి. వీరికి ఇద్దరు 2002లో వివాహం అయ్యింది. చిరంజీవికి వీరాభిమానిగా, అన్నయ్యగా పిలుస్తుంటాడు రవితేజ. రవితేజ, మెగా ఫ్యామిలీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. చిరంజీవితో కలిసి.. అన్నయ్య, ఆజ్ కా గూండారాజ్, వాల్తేరు వీరయ్యలో నటించాడు రవి. ఇక ఆయన కెరీర్ విషయానికి వస్తే.. తొలి నాళ్లల్లో చిన్నా, చితకా రోల్స్ చేసిన అతడిని హీరోను చేసేసిన సినిమా సింధూరం. నీకోసం మెయిన్ హీరోగా కనిపించాడు.. కానీ అతడి ఫేట్ మార్చిన చిత్రం మాత్రం.. ఇట్లు, శ్రావణి సుబ్రమణ్యం. ఆ సినిమా సక్సెస్ అతడిని వెనక్కు తిరిగి చూసుకోనివ్వలేదు. ఇప్పుడు ఈగల్ మూవీతో రాబోతున్నాడు. ఫిబ్రవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి