iDreamPost

OTT Platforms : మరోసారి వరంగా మారనున్న మూడో వేవ్

OTT Platforms : మరోసారి వరంగా మారనున్న మూడో వేవ్

కరోనా కాలాన్ని తమకు బెస్ట్ బిజినెస్ మోడల్ గా మార్చుకుని పూర్తిగా లాభపడ్డ ఓటిటి కంపెనీలు ఇప్పుడు ఒమిక్రాన్ మీద దృష్టి సారించాయి. కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ థియేటర్లు మూతబడటం, 50 శాతం ఆక్యుపెన్సీలు అమలులోకి రావడం లాంటి పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నాయి. 2021లో ఓటిటి కంటెంట్ కి గొప్ప ఆదరణ దక్కింది. డైరెక్ట్ డిజిటిల్ ప్రీమియర్లతో పాటు వెబ్ సిరీస్ లకు సైతం బ్రహ్మాండమైన ఆదరణ దక్కింది. సబ్స్క్రైబర్లు విపరీతంగా పెరిగారు. థియేటర్లలో టికెట్ రేట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో దాని సైతం అవకాశంగా వాడుకుని ఆకట్టుకునేందుకు ప్లాన్లు వేస్తున్నాయి.

ఇక ఓటిటి సంస్థలు సినిమాల పరంగా తమ టార్గెట్లను రెండు రకాలుగా విభజించుకున్నాయి. మొదటిది విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు. సెన్సార్ పూర్తి చేసుకుని థియేటర్ కు వెళ్లాలా వద్దా అనే డైలమాలో ఉన్న వాటికి టెంప్టింగ్ ఆఫర్లు ఇవ్వడం. ఇది అన్నింటికీ వర్తించదు. కేవలం స్టార్ క్యాస్టింగ్ ఉన్నవాటిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఉదాహరణకు రాధే శ్యామ్ కు ఒక బడా ఓటిటి ఏకంగా 300 కోట్ల ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇది మతి పోయే అమౌంట్. నిర్మాతలు ఒప్పుకోలేదు అది వేరే విషయం. కానీ ఇంత మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాయంటే మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ హీరోల సినిమాలకూ ఇవి గేలం వేస్తున్నాయి. ఇక రెండో టార్గెట్ థియేటర్ కు వెళ్ళడానికి పక్కాగా డిసైడ్ అయిన మూవీస్. ఆడినా ఆడకపోయినా తక్కువ గ్యాప్ లో తమ ప్లాట్ ఫార్మ్ మీద స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకుంటున్నాయి. అఖండ ఈ స్థాయిలో ఆడుతుందని ఊహించక నిర్మాత నాలుగు వారాల అగ్రిమెంట్ చేసుకున్నారు. తీరా చూస్తే అది బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్లిపోయింది. ఫ్లాప్ సినిమాకు ఈ ఇబ్బంది ఉండదు. అందుకే ఇరవై నుంచి నలభై రోజుల గరిష్ట పరిమితికి థియేటర్ సినిమాలను ఓటిటిలు కొనేస్తున్నాయి. మళ్ళీ కరోనా మూడో వేవ్ విరుచుకుపడుతున్న తరుణంలో వీటికి మళ్ళీ గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టే

Also Read : Pushpa OTT : పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అంత త్వరగా ఇస్తారా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి