iDreamPost

HYDలో స్థలం కొనే ముందు జాగ్రత్త! నష్టపోతారు..

హైదరాబాద్ లో ఏ ఏరియా చూసినా గానీ భూముల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు సామాన్యుడు స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. స్థలం కొందాం, ఒక ఇల్లు కట్టుకుందాం అని కల కనడం కూడా గగనమైపోయిన పరిస్థితి. భాగ్యనగరంలో భూమి అంటే ఆకాశంలో సమానమైపోయింది.

హైదరాబాద్ లో ఏ ఏరియా చూసినా గానీ భూముల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు సామాన్యుడు స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. స్థలం కొందాం, ఒక ఇల్లు కట్టుకుందాం అని కల కనడం కూడా గగనమైపోయిన పరిస్థితి. భాగ్యనగరంలో భూమి అంటే ఆకాశంలో సమానమైపోయింది.

HYDలో స్థలం కొనే ముందు జాగ్రత్త! నష్టపోతారు..

హైదరాబాద్ మహా నగరంలో రియల్ ఎస్టేట్ చాలా వేగంగా పుంజుకుంటుంది. నిజానికి ఇప్పుడు ఉండాల్సిన దాని కంటే భూముల ధరలు ఎక్కువ రెట్లు ఉన్నాయనే చెప్పాలి. హైదరాబాద్ లో ఏ ఏరియా చూసినా గానీ భూముల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు సామాన్యుడు స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. స్థలం కొందాం, ఒక ఇల్లు కట్టుకుందాం అని కల కనడం కూడా గగనమైపోయిన పరిస్థితి. భాగ్యనగరంలో భూమి అంటే ఆకాశంలో సమానమైపోయింది. ఇటీవల కోకాపేటలో ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లు పలికింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో భూముల ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో అన్న విషయం. ఎకరం భూమి రూ. 100 కోట్లు అంటే ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ కాస్ట్ లో 6వ వంతు పైనే.

డిమాండ్ కి తగ్గట్టు భూముల ధరలు పెరగడం అనేది సహజమే. కానీ మరీ ఇంత దారుణంగా పెరగడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా ప్లే చేసిన మైండ్ గేమ్ స్పష్టంగా కనబడుతోంది. నిజానికి భూముల ధరలు ఇంత ఉంటాయా? ఇంత ఉండే పరిస్థితి ఉందా? అంటే లేదు. కానీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ హైరేంజ్ లో ఉంది అన్నట్టు జనాల మైండ్ సెట్ ని ట్యూన్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల, శివారు ప్రాంతాల్లో భూములు కొనకపోతే జీవితం కోల్పోతామన్నట్టు ఫీలై చాలా మంది స్థలాలు కొనుక్కుంటున్నారు. ఆ తర్వాత వీలు చూసుకుని ఇల్లు కట్టుకుంటున్నారు. అయితే నిజంగా స్థలం కొన్నప్పుడు చాలా బాగుంటుంది. కానీ ఆ ప్రాంతంలో స్థలాలు ఇళ్లుగా రూపాంతరం చెందాక అసలు సమస్య మొదలవుతుంది.

వాన చుక్క పడితే రోడ్లు ఏరులవుతాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరుతాయి. మనం ఉన్నది వాగులోనా? రోడ్డు మీదనా అని అర్థం కాని పరిస్థితి. ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రస్తుత హైదరాబాద్ పరిస్థితి ఇదే. గట్టిగా వర్షం పడితే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. రోడ్లు జలాశయాలను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరొచ్చి చేరుతుంటే ఇంటి యజమానులు, అద్దెకున్న వారు ఇదేం కర్మరా భగవంతుడా అనుకునే పరిస్థితి. ఈ దుస్థితికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ సంస్థలు స్వార్థం కనిపిస్తుంది. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు పంట పొలాలను, చెరువులను కబ్జా చేసి వెంచర్స్ వేసేసి జనాలకు అంటగట్టేస్తున్నాయి. హైదరాబాద్ లో స్థలం కొనకపోతే జీవితం వృధా అన్నట్టు.. లేదా లక్షలు కోల్పోతారు అన్నట్టు ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తీరా లక్షలు, కోట్లు పెట్టి స్థలాలు కొంటారు. కొన్నాళ్ళకు అక్కడ మంచి ఇల్లు కట్టుకుంటారు. ఆ తర్వాత వర్షం పడితే అంతే సంగతులు.

ఇన్ని లక్షలు, కోట్లు పెట్టి స్థలం కొనుక్కున్నది నీటిలో సావాసం చేయడానికా? పొలాలను, చెరువులను కబ్జా చేసి స్థలాలుగా మార్చడం వల్ల హైదరాబాద్ లో వర్షం పడితే ఎక్కడ నీరు అక్కడే ఉండిపోతుంది. వర్షం నీరు వెళ్ళడానికి దారేది? చెరువులు కడుపు కొడితే ఆ వర్షం నీటిని తాగేది ఎవరు? రోడ్లా తాగలేవు. మనమా మునగలేము. ఇదేమీ కర్మ అని బతుకు బండిని మోకాళ్ళ లోతు నీటిలోనే పోనివ్వాల్సిన పరిస్థితి. చెరువులను కబ్జా చేయడం, ఎక్కువ ప్లాట్లు వేసి ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కాంక్షతో.. నాలాలను కుదించేయడం వంటి పనుల వల్ల ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోతుంది. కూకట్ పల్లి, ఆల్విన్ కాలనీ, గాజుల రామారాం ఇలా ఒకటేమిటి.. దాదాపు హైదరాబాద్ లో చాలా ఏరియాలు వర్షం పడితే మోకాళ్ళ లోతులో మునిగిపోయే పరిస్థితి. ఇలాంటి ముంపు ఏరియాల్లో స్థలం కొన్నందుకు ఇప్పుడు చాలా మంది రియలైజ్ అవుతున్నారు. వర్షం పడితే మునిగిపోయేది కేవలం రోడ్లు, ఇళ్ళు మాత్రమే కాదని.. తమ జీవితాలు కూడా అని బాధపడుతున్నారు. అందుకే హైదరాబాద్ లో స్థలం కొనేముందు బాగా ఆలోచించుకుంటే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి