iDreamPost

వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టకండి..

వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టకండి..

ఈ రోజుల్లో ఫ్రిడ్జ్‌ లేని ఇల్లు లేదు అలాగే ఫ్రిడ్జ్‌ లో పెట్టని పదార్థాలు లేవు. కానీ అన్ని ఆహారపదార్థాలను, పండ్లను ఫ్రిడ్జ్‌ లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్‌ లో పెట్టిన వాటిని తినడం వలన మన ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరం ఉన్న లేకపోయినా ఫ్రిడ్జ్‌ ఖాళీగా ఉందని అన్నింటిని ఫ్రిడ్జ్‌ లో పెట్టడం మంచిది కాదు.

* మామిడిపండ్లు, పుచ్చకాయలు ఫ్రిడ్జ్‌ లో పెట్టకూడదు. ఎందుకంటే పండ్లు రుచిని కోల్పోతాయి. ఈ పండ్లను విడిగా ఫ్రిడ్జ్‌ లో ఉంచితే అవి వేరే ఆహార పదార్థాల వాసనను పీల్చుకుంటాయి. కాబట్టి తప్పకుండ ఫ్రిడ్జ్‌ లో పెట్టాల్సి వస్తే ఏదయినా కవర్లో పెట్టి పెట్టాలి.
* పండ్లను, కూరగాయలను పక్క పక్కన పెట్టకూడదు.
* బ్రెడ్ ను ఫ్రిడ్జ్‌ లో పెట్టకూడదు, పెడితే బ్రెడ్ ఫ్రెష్ నెస్ పోతుంది.
* టమాటాలు ఫ్రిడ్జ్‌ లో పెడితే అవి వాటి రుచిని కోల్పోతాయి.
* ఉల్లిపాయలను కూడా ఫ్రిడ్జ్‌ లో పెట్టకూడదు.
* కెచప్, సొయాసాస్, వెనిగర్, ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ని ఫ్రిడ్జ్‌ లో అస్సలు పెట్టకూడదు.
* కాఫీని ఫ్రిడ్జ్‌ లో పెడితే టేస్ట్ పోతుంది.
* తేనెను ఫ్రిడ్జ్‌ లో పెట్టకూడదు.
* పచ్చళ్ళను ఫ్రిడ్జ్‌ లో పెట్టకుండా బయట పెడితేనే ఫ్రెష్ గా ఉంటాయి.
* స్ట్రాబెరిస్ కూడా ఫ్రిడ్జ్‌ లో పెట్టకూడదు.
* జామ్, జెల్లీ వంటివి కూడా ఫ్రిడ్జ్‌ లో పెట్టకుండా ఓపెన్ చేసినా కూడా బయటే ఉంచాలి.
* మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి కూడా ఫ్రిడ్జ్‌ లో పెట్టకూడదు.
* వెల్లుల్లిపాయలను ఫ్రిడ్జ్‌ లో అస్సలు పెట్టకూడదు. ఫ్రిడ్జ్‌ లో ఉంచితే తొందరగా కుళ్లిపోతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి