iDreamPost

హైదరాబాద్ లో ఉన్న టాప్ 10 క్రికెట్ అకాడమీలు ఇవే.. మీ పిల్లల్ని చేర్పిస్తే తిరుగులేదు

మీ పిల్లలను క్రికెటర్లుగా చూడాలనుకుంటున్నారా? క్రికెట్ ను కెరియర్ గా మలచాలని చూస్తున్నారా? అయితే హైదరాబాద్ లో ఆ టాప్ 10 క్రికెట్ అకాడమీల్లో చేర్పిస్తే భవిష్యత్తుకు తిరుగుండదు.

మీ పిల్లలను క్రికెటర్లుగా చూడాలనుకుంటున్నారా? క్రికెట్ ను కెరియర్ గా మలచాలని చూస్తున్నారా? అయితే హైదరాబాద్ లో ఆ టాప్ 10 క్రికెట్ అకాడమీల్లో చేర్పిస్తే భవిష్యత్తుకు తిరుగుండదు.

హైదరాబాద్ లో ఉన్న టాప్ 10 క్రికెట్ అకాడమీలు ఇవే.. మీ పిల్లల్ని చేర్పిస్తే తిరుగులేదు

సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని కోరుకుంటుంటారు. కానీ నేటి రోజుల్లో తల్లిందండ్రులు పిల్లల భవిష్యత్ గురించి కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. చదువు ఒక్కటే కాకుండా ఇతర రంగాల్లో కూడా రాణించేలా తమ పిల్లలను సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో యువతపై అత్యంత ప్రభావం చూపించే అంశాలు ఏవైనా ఉన్నాయా అంటే.. అవి ఒకటి సినిమాలు. మరొకటి స్పోర్ట్స్. దేశంలో ఈ రెండింటికి ఉన్న క్రేజ్ వేరు. సినిమా యాక్టర్ అయితే పేరు, డబ్బు, గౌరవం, అంతకు మించి అభిమానుల ఆదరణ తరతరాల వరకు చెరిగి పోకుండా ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మహానటి సావిత్రి, జయసుధ, రాధిక ఇంకా ఇతర నటీనటులు సినిమా ఉన్నతం కాలం సజీవంగానే ఉంటారు. దీంతో సినిమా రంగం వైపు పిల్లల్ని ప్రోత్సహించేందుకు పేరెంట్స్ ఇంట్రస్టు చూపిస్తున్నారు.

ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రపంచమంతా వినిపిస్తున్న క్రీడా ఏదైనా ఉందంటే అది క్రికెట్ మాత్రమే. క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. క్రికెట్ ను కెరియర్ గా మార్చుకునేందుకు యూత్ తెగ ఇంట్రస్టు చూపిస్తున్నారు. ఒకప్పుడు స్పోర్ట్స్ లో అవకాశాలు తక్కువ.. చివరికి భవిష్యత్తు ఏమైపోతుందో అనే చింత ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. ఒక్క మ్యాచ్ లో రాణిస్తే చాలు లైఫ్ సెట్ అయిపోయినట్టే. అంతేకాదు స్పోర్ట్స్ కేటగిరీలో ఉద్యోగాలు కూడా పొందుతున్నారు క్రీడాకారులు. ఐపీఎల్ లో టాలెంట్ ఉన్న ప్లేయర్స్ పై ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరిస్తున్నారు. దీంతో క్రికెట్ ప్లేయర్స్ దశ తిరి కోటీశ్వరులుగా మారుతున్నారు.

top 10 academys

జాతీయ జట్టులో ఆడే ప్లేయర్స్ కు అందించే జీతాలు కూడా ఎక్కువే. దేశం కోసం ఆడే అవకాశం కోట్ల మందిలో కొంత మందికే దక్కుతుంది. డబ్బుకు డబ్బు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది క్రికెట్ ప్లేయర్స్ కు. కపిల్ దేవ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, గంగూళీ, ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్రికెట్ దిగ్గజాలైన వీరికి యూత్ లో ఉన్న క్రేజే వేరు. వీరిని ఆదర్శంగా తీసుకుని యంగ్ ప్లేయర్స్ క్రికెట్ ని కెరియర్ గా మలుచుకుంటున్నారు. మరి మీరు కూడా మీ పిల్లలను క్రికెటర్ గా చూడాలనుకుంటున్నారా? క్రికెట్ లో రాణించేందుకు మంచి శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారా? అయితే హైదరాబాద్ లో ది బెస్ట్ క్రికెట్ అకాడమీలు ఉన్నాయి. నగరంలో ఉన్నటువంటి ఈ 10 క్రికెట్ అకాడమీల్లో శిక్షణ ఇప్పిస్తే భవిష్యత్తుకు తిరుగుండదు. హైదరాబాద్ లో ఉన్న ఆ పది క్రికెట్ అకాడమీలు ఏవంటే?

హైదరాబాద్‌లోని టాప్ 10 క్రికెట్ అకాడమీలు ఇవే

1. వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీ: హైదరాబాద్‌లోని వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీ
2. అర్షద్ అయూబ్ క్రికెట్ అకాడమీ
3. ఆల్ సెయింట్స్ క్రికెట్ అకాడమీ
4. సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ:
5. జైసింహ క్రికెట్ అకాడమీ
6. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ తెలంగాణ
7. జుబీ క్రికెట్ అకాడమీ
8. ప్రగతి క్రికెట్ అకాడమీ
9. డేనియల్ క్రికెట్ అకాడమీ
10. ఇన్‌స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ హైదరాబాద్ తెలంగాణ

గమనిక: ఈ అకాడమీలకు సంబంధించి ఇంటర్నెట్ లో లభించిన సమాచారాం మేరకు అందిస్తున్నాము. మీరు మీ పిల్లలను ఈ క్రికెట్ అకాడమీల్లో చేర్చాలనుకుంటే నేరుగా సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని చేర్పిస్తే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి