iDreamPost

రానాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు

రానాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు

పవన్ కళ్యాణ్ రానా కాంబోలో రూపొందుతున్న అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ తాలూకు ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని రేపు విడుదల చేయబోతున్నారు. అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ సోర్సెస్ నుంచి దీనికి భీమ్లా నాయక్ అనే పేరు అల్రెడీ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ప్రీ లుక్ గా నిన్న ఒక చిన్న పోస్టర్ వదిలితే అది కూడా సోషల్ మీడియాలో బాగానే హంగామా చేసింది. అయితే రానా కూడా ఇందులో భాగమైనప్పుడు తనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదాని సందేహం వ్యక్తం చేసిన అభిమానులు లేకపోలేదు. పోస్టర్ లోనూ టైటిల్ లోనూ రెండింటిలోనూ తమ హీరోకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదనేది వాళ్ళ కామెంట్.

ఇక్కడో లాజిక్ మిస్ కాకూడదు. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద మార్కెట్ చేస్తున్న సినిమా. రానా ఒక సపోర్టింగ్ ఫ్యాక్టర్ తప్ప తనవల్ల దీని బిజినెస్ రేంజ్ రెట్టింపు కాదు. కాబట్టే ఫోకస్ అంతా భీమ్లా నాయక్ మీదే పెడుతున్నారు. ఇక్కడ బాహుబలి ఫార్ములాని మర్చిపోకూడదు. ఇంత కన్నా పవర్ ఫుల్ క్యారెక్టర్ ని రానా అందులో పోషించాడు. అయినా కూడా టైటిల్ ప్రభాస్ మీద ఉంది తప్ప భల్లాల అనే ప్రస్తావన బాహుబలి టైటిల్ లో ఉండదు. సినిమాలో సైతం సబ్జెక్టులో ప్రాధాన్యం తప్ప కనీసం పాట కూడా ఉండదు. ఎందుకంటే రానా పాత్ర అందులో విలన్ కాబట్టి అదంతా సముచితంగానే ఉంటుంది

ఇక భీమ్లా నాయక్ విషయానికి వస్తే ఇందులో రానా చేస్తున్న పాత్రలోనూ నెగటివ్ షేడ్స్ ఉంటాయి. కథ ప్రకారం సైలెంట్ గా నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్ ను బజారుకు ఈడ్చి రచ్చ చేసేది అతనే. లేకపోతే అసలు గొడవే ఉండేది కాదు. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ చేసింది కూడా ఇదే. కాకపోతే తన ఇమేజ్ వేరు కాబట్టి టైటిల్ ని అలా పెట్టడం జరిగింది. అంతే తప్ప రానా ఉన్నాడు కాబట్టి భీమ్లా నాయక్ ని ఆర్ఆర్ఆర్ లా మల్టీ స్టారర్ అని స్టాంప్ వేయలేం. జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమాకు రాధే శ్యామ్, సర్కారు వారి పాట రూపంలో ఇప్పటికే గట్టి పోటీ ఫిక్స్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు

Also Read : భుజ్ ది ప్రైడ్ అఫ్ ఇండియా రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి