iDreamPost

అంతకన్నా ఛాన్స్ లేదంటున్న జక్కన్న

అంతకన్నా ఛాన్స్ లేదంటున్న జక్కన్న

అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ వస్తుందా రాదా అనే టెన్షన్ కు దాదాపు తెరపడినట్టే. వాయిదా మరోసారి తప్పకపోవచ్చని అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. చేతిలో యాభై రోజులు మాత్రమే ఉన్న తరుణంలో హడావిడి చేసి విడుదల కోసం పాకులాడటం కంటే వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయడమే మంచిదని ఒరిజినల్ నిర్మాత డివివి దానయ్యతో పాటు ఇతర బాషల హక్కులు కొనుకున్న ప్రొడ్యూసర్లు కూడా ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారట. 2022 సంక్రాంతికి రావడం నైతికంగా కరెక్ట్ కాదు. పైగా లేనిపోని తలనెప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ గోలంతా ఎందుకని ఉగాది లేదా సమ్మర్ కు ప్లాన్ చేసుకుందామని ఆల్రెడీ అండర్ స్టాండింగ్ కి వచ్చారట.

లాక్ డౌన్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాలకు పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. ఇటీవలే రిలీజైన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ కు చాలా చోట్ల దారుణమైన వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో బంద్ ఉండటం తీవ్ర ప్రభావం చూపించింది. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే తెలుగు రాష్ట్రాల తరహాలో ప్రతి చోట ఆడియన్స్ థియేటర్లకు వచ్చేందుకు రెడీగా లేరు. భయం ఉన్న మాట వాస్తవం. కరోనా థర్డ్ వేవ్ ముప్పు లేకపోయినా ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా చర్యగా సినిమా హాళ్లకు నిబంధనలు కొనసాగిస్తున్నాయి. అటుఇటుగా ఇది నవంబర్ దాకా ఉంటుంది.

సో ఆర్ఆర్ఆర్ కోసం ఇంకో ఏడెనిమిది నెలల నిరీక్షణ తప్పదు. ఇటీవలే ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న జక్కన్న టీమ్ రాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత వేగం చేయనుంది. విజువల్ ఎఫెక్ట్స్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించబోతున్నారు. అయిదు వందల కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్ కు అంతా నార్మల్ గా ఉంటే తప్ప పెట్టుబడి వెనక్కు రావడం కష్టం. అందులోనూ ఈ 2021 చివరి దాకా రోజులు ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ అంతు చిక్కడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోని ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో చూసుకుని సంతృప్తి పడటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి

Also Read : బజార్ రౌడీ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి