iDreamPost

ఒలింపిక్స్ పోటీలపై కరోనా ఎఫెక్ట్ ఉండదు

ఒలింపిక్స్ పోటీలపై కరోనా ఎఫెక్ట్ ఉండదు

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనా కరోనా వైరస్ వల్ల అతలాకుతలం అవుతుంది. దాదాపు 27 దేశాల్లో కరోనా వ్యాపించింది. సుమారు 636 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. దీంతో ఈ సంవత్సరం జులై 24న జపాన్ లో జరగాల్సిన ఒలంపిక్స్ పోటీల నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి.

కాగా జపాన్ లో జరగాల్సిన ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ తొషిరో ముటో స్పష్టం చేసారు. అనుకున్న విధంగానే షెడ్యూల్ ప్రకారంగా ఒలింపిక్స్ నిర్వహిస్తామని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని చెప్పుకొచ్చారు. జపాన్ లో వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. దీంతో జపాన్ లో నిర్వహించబోయే ఒలింపిక్స్ పై ఉన్న అనుమానాలకు జవాబు దొరికినట్లయింది.

అయితే జపాన్ లో ఇప్పటికే 40 మందికి కరోనా వైరస్ సోకగా దాని ద్వారా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని జపాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీంతో జులై 24 న ఒలింపిక్స్, ఆగష్టు 25 న పారా ఒలింపిక్స్ జపాన్ లోనే జరుగుతాయని తేల్చిచెప్పినట్లయింది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి