iDreamPost

Nayattu : బ్లాక్ బస్టర్ రీమేక్ నిర్ణయం మారిందట

Nayattu : బ్లాక్ బస్టర్ రీమేక్ నిర్ణయం మారిందట

గత ఏడాది మళయాలంలో విడుదలై ఘనవిజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాయట్టుని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో గీత ఆర్ట్స్ హక్కులు కొని పెట్టుకున్న సంగతి తెలిసిందే. పలాస శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో దీన్ని ప్లాన్ చేసుకున్నారు. రావు రమేష్ లాంటి క్యాస్టింగ్ ని మెల్లగా సెట్ చేసుకుంటున్న తరుణంలో ఇది ఆగిపోయిందన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏవేవో కారణాలు బయటికి వినిపించాయి కానీ నిజానికి బడ్జెట్ ఇష్యూస్ వల్లే ఆపేశారని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ లో వేసుకున్న ఎస్టిమేట్ కి జరగబోయే బిజినెస్ కి మధ్య చాలా గ్యాప్ కనిపించిందట. అందుకే బ్రేక్ పడింది.

సుమారుగా తొమ్మిది కోట్ల దరిదాపుల్లో లెక్క తేలిందట. మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ హీరో ఎవరైనా దీన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. కేవలం సబ్జెక్టుని నమ్ముకుని క్యారెక్టర్ ఆర్టిస్టుల బలంతో అంత మొత్తాన్ని థియేటర్లలో రాబట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. పైగా నాయట్టు రెగ్యులర్ కమర్షియల్ కథ కాదు. మంచి టెంపోతో సాగే ఒక క్రైమ్ డ్రామా. ఇందులో మసాలాలు మాస్ ని ఆకట్టుకునే రెగ్యులర్ ఫార్ములాలు ఉండవు. అలాంటి వాటిని ప్రేక్షకులు ఓటిటిలో చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఇటీవలే ఆహాలో వచ్చిన రాజేంద్రప్రసాద్ సేనాపతిని ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఓటిటిలో ఊహించనంత మంచి స్పందన వస్తోంది.

సో ఇప్పుడు నాయట్టుని కూడా ఇదే తరహాలో డబ్బింగ్ వెర్షన్ ని గ్రాండ్ ప్రీమియర్ గా ఆహాలో వేసే ఆలోచన జరుగుతోందట. ఇదంతా అఫీషియల్ గా చెప్పలేదు కానీ మొత్తానికి లీకుల రూపంలో మ్యాటర్ మొత్తం బయటికి వచ్చేసింది. అయినా మలయాళం ఆడిన ప్రతి బ్లాక్ బస్టర్ తెలుగులోనూ అంతే స్పందన తెచ్చుకుంటుందన్న గ్యారెంటీ లేదు. రైట్స్ ని కొనడం వరకు బాగానే ఉంటుంది కానీ దాన్ని తెలుగీకరించి మన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు మార్పులు చేయడం అవసరం. ఈ కారణంగానే అంతటి చిరంజీవి గాడ్ ఫాదర్ సెట్స్ పైకి వెళ్ళడానికి దర్శకులను మార్చుకుంటూ చాలా టైం పట్టింది. ఇక చిన్న సినిమాల గురించి వేరే చెప్పాలా

Also Read : Radhe Shyam : ముందూ వెనుకా చూస్తున్న పాన్ ఇండియా సినిమా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి