iDreamPost

ఆధార్ కార్డుదారులకు అలర్ట్.. త్వరగా ఈ పని చేయండి!

ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. త్వరగా మీరు ఈ పని చేయండి. లేదంటే ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. త్వరగా మీరు ఈ పని చేయండి. లేదంటే ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

ఆధార్ కార్డుదారులకు అలర్ట్.. త్వరగా ఈ పని చేయండి!

ఆధార్ కార్డు ఇది 12 అంకెలు కలిగిన విశిష్ట గుర్తింపు సంఖ్య. భారత దేశ పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఐడెంటిటీ కార్డును జారీ చేసింది. ఆధార్ గుర్తింపు కార్డుగానే గాక పలు పథకాలకు తప్పనిసరి అయిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాల ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. కాగా కేంద్ర ప్రభుత్వం 2010లో ఆధార్ కార్డు జారీ ప్రక్రియను ప్రారంభించింది. కాగా ఆధార్ పొంది పదేళ్లు పూర్తైన వారు అప్ డేట్ చేసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు దారులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. అప్ డేట్ గడువు తేదీ ముంచుకొస్తుంది. త్వరగా మీరు ఈ పని చేయకపోతే ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

2010లో ఆధార్ కార్డులు జారీ చేసేటప్పుడు చాలా తప్పులు దొర్లాయి. ఇప్పుడు పదేళ్లు దాటిన ఆధార్ కార్డులను తప్పని సరిగా అప్ డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం జూన్ 14 వరకు గడువు విధించారు. కానీ, పౌరుల నుంచి సరైన స్పందన రాలేదు. అందుకే ఆ గడువును మరో 3 నెలలు పొడిగిస్తూ సెప్టెంబర్ 14 వరకు అవకాశం కల్పించారు. అప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో అప్ డేట్ చేసుకోక పోవడంత మరో సారి గడువు పొడిగిస్తూ డిసెంబర్ 14 2023 వరకు ఫ్రీగా అప్ డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మరో ఐదు రోజుల్లో ఆ గడువు ముగియనున్నది. గడువు తీరిన తరువాత ఆధార్ అప్ డేట్ కు రుసుము వసూలు చేయనున్నారు.

గడువులోగా ఆధార్ కార్డు హోల్డర్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు. పౌరులు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్స్‌ను ఆన్‌లైన్‌లో https://myaadhaar.uidai.gov.in వెబ్ సైట్‌లో ఉచితంగా ఆధార్‌ను అప్ డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ సూచనలు పదేళ్ల క్రితం ఆధార్‌ తీసుకున్నవారు కొన్ని డాక్యుమెంట్స్ సబ్‌మిట్ చేసి వివరాలను అప్‌డేట్ చేయాలని యూఐడీఏఐ గతంలో స్పష్టం చేసింది. ప్రజలు డెమోగ్రఫిక్ వివరాలను అప్‌డేట్ చేస్తే సేవలు త్వరగా, సులభంగా అందించే అవకాశం ఉంటుందని సంస్థ పేర్కొంది. మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆధార్ కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కాబట్టి ఆధార్ అప్ డేట్ కు గడువు ముంచుకొస్తున్న తరుణంలో ఉచితంగా ఇప్పుడే అప్ డేట్ చేసుకోండి. లేదంటే గడువు ముగిసిన తర్వాత ఫీజు చెల్లించాల్సి వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి