iDreamPost

దేశంలో మరో 9 వందే భారత్ రైళ్లు.. తిరిగేదీ ఈ రూట్లలోనే

దేశంలో మరో 9 వందే భారత్ రైళ్లు.. తిరిగేదీ ఈ రూట్లలోనే

‘బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లేండి. దీన్నికాని నమ్ముకుంటే ఇంతేనండి, ఇంతేనండి’ అనే విమర్శల పాటల నుండి దేశంలో రైలు వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి. గమ్యస్థానాలకు త్వరగా చేరువ చేసే ఎక్స్ ప్రెస్‌ రైళ్ల దగ్గర నుండి సూపర్ ఫాస్ట్ సర్వీసులు వచ్చాయి. అదేవిధంగా అందిపుచ్చిన టెక్నాలజీతో మెట్రో వంటి రైళ్లు వచ్చాయి. ఇప్పుడు మరింత వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టును చేపడుతుంది భారత్. అయితే ప్రస్తుతం దేశంలో వేగవంతంగా దూసుకెళుతున్న రైళ్లు ఉన్నాయంటే అది వందే భారత్ సర్వీసులే. కాగా, ప్రస్తుతం దేశంలో 25 వందే భారత్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రయాణం సుఖవంతంగా, వేగంగా జరుగుతుండటంతో వీటికి ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో మరి కొన్నింటిని సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుండి తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను సిద్ధం చేసింది. కాగా, వీటిలో మూడింటిని సౌత్ రైల్వేస్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. ముంబయి కేంద్రంగా ఉన్న వెస్ట్రన్ రైల్వేస్ కు మరో వందే భారత్‌ను కేటాయించారు. సౌత్ సెంట్రల్, నార్త్ వెస్ట్రన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్‌కు ఒక్కో వందే భారత్ రైలును కేటాయించినట్లు సమాచారం. మరో రైలును ఏ ఖాతాలో వేస్తారో తెలియరాలేదు. అయితే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కు గానీ, రాజస్తాన్‌కు గానీ కేటాయించవచ్చు. అయితే వీటని లాంచ్ చేసేది ఎప్పుడో ఇంకా నిర్ధారణ కాలేదు. వీటిలో రెండు రైళ్లు జైపూర్- జైపూర్-ఇండోర్, జైపూర్-ఉదయ్‌పూర్ రూట్లలో రన్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. జైపూర్-ఇండోర్ వందే భారత్ నీముచ్ నుంచి వెళ్తుందని ఓ అధికారి చెప్పారు. ఈ మేరకు గత రెండు రోజులుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉదయపూర్, నీముచ్ రైల్వే స్టేషన్లను సందర్శించారు. ఈ రైళ్లను గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి.. ఆయా మార్గాల్లో తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి