iDreamPost

వీడియో: తండ్రికి గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన తనయుడు

  • Published Nov 16, 2023 | 10:16 AMUpdated Nov 16, 2023 | 10:16 AM

ఈ మద్య కాలంలో చాలా మంది గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. చిన్నా.. పెద్ద అనే వయసు తేడా లేకుండా ఇటీవల వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈ మద్య కాలంలో చాలా మంది గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. చిన్నా.. పెద్ద అనే వయసు తేడా లేకుండా ఇటీవల వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

  • Published Nov 16, 2023 | 10:16 AMUpdated Nov 16, 2023 | 10:16 AM
వీడియో: తండ్రికి గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన తనయుడు

ఇటీవల దేశంలో గుండె పోటు మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుండెపోటు పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. అకస్మాత్తుగా ఉన్నచోటే కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్న వయసు వారి నుంచి వృద్దుల వరకు గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తున్నారు. ఎక్కువగా వ్యాయామం చేయడం, జాగింగ్, డ్యాన్స్ లు చేయడం, అనారోగ్య కారణాల వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. అంతేకాదు ఇటీవల కరోనా భారిన పడ్డవారు కూడా హార్ట్ ఎటాక్ కి గురై చనిపోతున్నారని అంటున్నారు. అయితే హఠాత్తుగా కుప్పకూలిపోయి శ్వాస ఆడని సమయంలో సీపీఆర్ (కార్డియో-పల్మనరీ రిససిటేషన్) చేయడం వల్ల బాధితులను కాపాడే ఛాన్సు ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్ లో అనూహ్య సంఘటన జరిగింది. వివరాల్లోక వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన ఒక వృద్దుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అక్కడ ఉన్న అతని కుమారుడు స్పందించి సీపీఆర్ చేసి తన తండ్రిని ప్రాణాలతో కాపాడగలిగాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత దేశంలో అద్భుత కట్టడం అయిన తాజ్ మహల్ ని చూడటానికి ఒక కుటుబం వచ్చింది. తాజ్ మహల్ కాంప్లెక్స్ లో ఓ వృద్దుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. దాంతో పక్కన ఉన్నవాళ్లంతా ఒక్కసారే కంగారు పడ్డారు. అయితే ఆ వృద్దుడి కుమారుడు సమయస్ఫూర్తి ప్రదర్శించి వెంటనే ఆయకు సీపీఆర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వృద్దుడికి శ్వాస ఆడటంతో లేచాడు. తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తానికి సీపీఆర్ పద్దతి ద్వారా తన తండ్రికి కాపాడిన దృశ్యాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గతంలో ఎంతోమంది రోడ్డుపై హఠాత్తుగా కుప్పకూలిపోతే.. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, సీపీఆర్ గురించి తెలిసిన వారు వెంటనే స్పందించి బాధితుడికి సీపీఆర్ చేసి బ్రతికించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గుండెపోటుకు గురైన బాధితులకు వెంటనే వైద్య సహాయం అందే సమయం లేకపోతే.. సీపీఆర్ చేయడం ఎంతో ఉపయోకరంగా మారుతుంది. బాధితుడి శరీరంలో రక్తప్రవాహం కొనసాగేందుకు సీపీఆర్ సహాయపడుతుంది. తద్వారా ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుందని.. తర్వాత వారికి మెరుగైన చికిత్స అందించే వీలు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే అప్పుడప్పుడు వైద్య సిబ్బంది, సామాజిక కార్యకర్తలు క్యాంపులు నిర్వహించి సీపీఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గుండెపోటుకు గురైన వారికి వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాల నిలబెట్టవొచ్చు అని ఈ వీడియో అందరికీ తెలియజేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి