iDreamPost

వీడియో: దుబాయ్ లో ఆకాశం పచ్చగా మారడానికి కారణం ఏంటంటే?

Green Sky In Dubai: దుబాయ్ ని వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి విమానాశ్రయం కాడా ఈ వర్షపు నీటిలో మునిగిపోయింది. ఇలాంటి తరుణంలో ఆకాశం పచ్చగా మారడం చర్చనీయాంశంగా మారింది.

Green Sky In Dubai: దుబాయ్ ని వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి విమానాశ్రయం కాడా ఈ వర్షపు నీటిలో మునిగిపోయింది. ఇలాంటి తరుణంలో ఆకాశం పచ్చగా మారడం చర్చనీయాంశంగా మారింది.

వీడియో: దుబాయ్ లో ఆకాశం పచ్చగా మారడానికి కారణం ఏంటంటే?

ఎప్పుడు ఎండలు, ఇసుక తుపానులు, పర్యాటకుల తాకిడితో రద్దీగా ఉండే ఉండే దుబాయ్ ని ప్రస్తుతం వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. కోట్లు విలువ చేసే కార్లు నీళ్లల్లో తేలియాడుతూ కనిపిస్తున్నాయి. యూఏఈలో గత 75 సంవత్సరాల్లో ఇలాంటి వర్షాలు రాలేదు. ఏడాదిన్నరలో కురవాల్సిన వర్షపాతం ఒక్క రాత్రే కురిసింది. అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రం నీట మునిగింది. భారత్- యూఏఈ మధ్య ఏకంగా 28 విమానాలు రద్దయ్యాయి. ఇలాంటి తరుణంలో దుబాయ్ లో మరో వింత ఘటన జరిగింది. అక్కడి ఆకాశంలో జరిగిన విచిత్రం చూసి స్థానికులు షాకవుతున్నారు.

గత నాలుగు రోజులుగా యూఏఈలో వర్షాలు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడ చూసినా వర్షపు నీరు నిలిచిపోయింది. విమానాశ్రయం కూడా నీట మునిగింది. 24 గంటల్లో ఏకంగా 142 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇదిలా ఉండగా దుబాయ్ లో ఆకాశం పచ్చగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు వర్షాలతోనే సతమతమవుతున్న అక్కడి ప్రజలు ఈ దృశ్యాలను చూసి ఒకింత కంగారు పడ్డారు కూడా. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్టింట ఎక్కడ చూసినా దుబాయ్ వర్షాలకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. వాటిలో ఈ ఆకాశం పచ్చగా మారిన వీడియోస్ కూడా ఉన్నాయి. అయితే అలా ఎందుకు జరిగింది అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న.

Green Dubai

ట్విట్టర్ లో ఒక యూజర్ టైమ్ ల్యాప్స్ వీడియో పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 17న ఆ వీడియో పోస్ట్ చేసి ఉంది. దానికి క్యాప్షన్ గా దుబాయ్ లో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. ఆకాసం పచ్చగా మారిపోయింది. అని ఒక 23 సెకన్ల వీడియో పోస్ట్ చేశాడు. మరో యూజర్ దుబాయ్ లో ప్రస్తుతం ఇదీ పరిస్థితి.. ఆకాశం పచ్చగా అయ్యింది అంటూ ఏప్రిల్ 16 సాయంత్రం పోస్ట్ చేశాడు. మొదటి రెండు వీడియోలు ఒకేలా ఉండగా మరో యూజర్ వేరే వీడియో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 17 తెల్లవారుజామున పోస్ట్ చేసిన వీడియో ఇది. దానికి క్యాప్షన్ ‘దుబాయ్ లో భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం పచ్చగా మారిపోయింది. అంతా డస్టీగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో చాలా మంది ఆ దృశ్యాలను చూసి షాకవుతున్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది మాత్రం అసలు అలా ఎందుకు మారిందని ప్రశ్నిస్తున్నారు.

పచ్చగా ఎందుకు మారింది?:

ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ ఒక థియరీని కోట్ చేసింది. ఎక్కువ నీటిని కలిగి ఉన్న అతి పెద్ద తుపాను మేఘాలు నీలి రంగు కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. అలాంటి కాంతి మీద ఎరుపు రంగు కాంతి కిరణాలు పడినప్పుడు ఆకాశం పచ్చగా మారేందుకు ఆస్కారం ఉన్నట్లు జాతీయ వాతావరణ శాఖ వెల్లడించినట్లు ఫాక్స్ న్యూస్ కోట్ చేసింది. అలాగే మరో రిపోర్ట్ లో విస్కాన్సిన్ యూనివర్సిటీకి చెందిన వాతావరణంపై అధ్యయనం చేసే శాస్త్రవేత్త కూడా తన అభిప్రాయాన్ని వివరించారు. “బ్లూ కలర్ కాంతిని కలిగి ఉన్న మేఘాలపై ఎరుపు రంగు కాంతి పడినప్పుడు మేఘాలు పచ్చగా మారతాయి. అయితే పచ్చరంగు మేఘాలు వచ్చినంత మాత్రానా సుడిగాలులు(టోర్నెడోలు) వస్తాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు” అంటూ మాడిసన్ వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా దుబాయ్ వర్షాలు, వరదలు, ఆకాశం పచ్చగా మారడం చర్చనీయాంశంగా మారింది. ఈ వైరల్ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి