iDreamPost

రోడ్డుపై పడ్డ నోట్లను ఏరుకున్న పోలీసులు.. తర్వాత..

Currency Notes on The Road: అప్పుడప్పుడు రోడ్డుపై కొంతమంది సెన్సేషన్ కోసం కరెన్సీ నోట్లను రోడ్డుపై వెదజల్లుతారు.. ఆ సమయంలో ప్రజలను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు కక్కుర్తి పడ్డారు.

Currency Notes on The Road: అప్పుడప్పుడు రోడ్డుపై కొంతమంది సెన్సేషన్ కోసం కరెన్సీ నోట్లను రోడ్డుపై వెదజల్లుతారు.. ఆ సమయంలో ప్రజలను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు కక్కుర్తి పడ్డారు.

రోడ్డుపై పడ్డ నోట్లను ఏరుకున్న పోలీసులు.. తర్వాత..

సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని ఆశ్చర్యం, భయం కలిగించేలా ఉంటున్నాయి. ఈ మధ్యసోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు. కొన్నిసార్లు అదృష్టం బాగుంటే రాత్రికి రాత్రే స్టార్లు అయిన వారు ఉన్నారు. కొంతమంది రోడ్డుపై కరెన్సీ నోట్లు విసురుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. ఆ సమయంలో రోడ్డుపై జనాలు గుమి కూడటం.. ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుంది. అలాంటి ఘటనే జార్ఖండ్ లో జరిగింది.. కాకపోతే కంట్రోలో చేయాల్సిన పోలీసులు కక్కుర్తి పడ్డారు. వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్ లోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.రామ్ గఢ్ లో కొంతమంది కరెన్సీ నోట్లను వెదజల్లుకూంటూ వెళ్లారు. వాటిని పోలీసులు ఏరుకోవడం.. దానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు పోలీసులను సస్పెండ్ చేశారు. జార్ఖండ్ జిల్లాకు చెందిన ఓ బోగ్గు వ్యాపారి గత కొంత కాలంగా అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడు. అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే బైక్ పై వెళ్తున్న ఆ వ్యాపారి తన జేబులో నుంచి కరెన్సీ నోట్లను రోడ్డు పై విసిరి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఏఎస్ఐ తో సహా నలుగురు పోలీసులు రోడ్డుపై పడ్డ ఆ నోట్లను ఏరుకున్నారు.

పోలీసుల నిర్వాకాన్ని అటుగా వెళ్తున్న కొంతమంది తమ సెల్ ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇంకేముంది.. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడం.. అధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్ఐ తో సహా నలుగురు పోలీసులను వెంటనే సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ పీయూష్ పాండే తెలిపారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఇలాంటి నిర్లక్ష్య వైఖరి అస్సలు సహంచేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. ఏది ఏమైనా రోడ్డు పై పడ్డ సొమ్ము రికవరీ చేయాల్సింది పోయి.. జేబులో వేసుకున్నందుకు సరైన శిక్ష పడిందని నెటిజన్లు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి