iDreamPost

VIDEO: పట్టపగలు నడి రోడ్డుపై యువకుడి రచ్చ! ఏకంగా హోర్డింగ్ ఎక్కి..!

నిజాబాద్ లో ఓ వ్యక్తి పట్టపగలు హల్చల్ సృష్టించాడు. మద్యం మత్తులో ఏకంగా హోర్డింగ్ ఎక్కి నానా హంగామ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

నిజాబాద్ లో ఓ వ్యక్తి పట్టపగలు హల్చల్ సృష్టించాడు. మద్యం మత్తులో ఏకంగా హోర్డింగ్ ఎక్కి నానా హంగామ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

VIDEO: పట్టపగలు నడి రోడ్డుపై యువకుడి రచ్చ! ఏకంగా హోర్డింగ్ ఎక్కి..!

నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు పట్టపగలు హల్చల్ సృష్టించాడు. నడి రోడ్డుపై రచ్చ రచ్చ చేశాడు. ఇక ఇంతటితో సరిపెట్టకుండా పక్కనే ఉన్న ఓ హోర్డింగ్ ఎక్కాడు. కాసేపు దానిపైనే కునుకు కూడా తీశాడు. వాహనదారులు వెంటనే అప్రమత్తమై అతడిని కిందకు దించే ప్రయత్నాలు చేశారు. కానీ, ఇవేం లెక్క చేయని అతగాడు.. దానిపైనే ఆ యువకుడు నానా హంగామా సృష్టించాడు. ఇదంతా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదే ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇంతకు అతడు హోర్డింగ్ ఎందుకు ఎక్కాడు? అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో రవీందర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా పెయింటింగ్ పని చేస్తూ ఉండేవాడు. అయితే ఇతడు గతంలో ఓ వ్యక్తికి రూ.1000 అప్పు ఇచ్చాడు. చాలా రోజులైన అతడు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదు. దీంతో రవీందర్ అప్పు తీసుకున్న వ్యక్తిని చాలా సార్లు అడిగి చూశాడు. ఆ యువకుడు ఇస్తాం లే అన్నట్లుగా చెప్పినట్లు సమాచారం. దీంతో కోపంతో ఊగిపోయిన రవీందర్.. ఆదివారం ఫుల్ గా మద్యం సేవించి కంఠేశ్వర్ లో నడి రోడ్డుపై రచ్చ రచ్చ చేశాడు. ఇంతే కాకుండా అక్కడే ఉన్న ఓ హోర్డింగ్ కూడా ఎక్కాడు. ఇంతే కాదండోయ్.. దానిపైనే నిద్రపోతున్నట్లు నటించాడు.

ఇదంతా గమనించిన కొందరు వక్తులు వెంటనే దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కిందకు దిగాలని రవీందర్ ను చాలా సేపు బతిమాలారు. అర్థమయ్యేట్టు చెప్పినా ఆ వ్యక్తి అస్సలు వినలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో పోలీసులు స్థానికుల సాయంతో ఎట్టకేలకు ఆ యువకుడిని కిందకు దించారు. ఆ తర్వాత పోలీసులు ఎందుకు ఎక్కావని పోలీసులు రవీందర్ ను ప్రశ్నించగా.. నేను గతంలో ఓ వ్యక్తికి రూ.1000 అప్పు ఇచ్చాను. కానీ, అతడు ఎంతకు తిరిగి ఇవ్వడం లేదు. అందుకే కోపంతో మద్యం సేవించి హోర్డింగ్ ఎక్కానని చెప్పాడు. అతని సమాధానాలు విని పోలీసులు, స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి