iDreamPost

కూతురు కులాంతర వివాహం! కొట్టుకుంటూ తీసుకెళ్లిన తండ్రి! సినిమా రేంజ్ స్టోరీ!

కూతురు అడగ్గానే అన్ని తెచ్చి పెట్టే తండ్రి.. ఓ వ్యక్తిని ప్రేమించాను అని చెప్పగానే.. ఎలాంటి వాడు అని కనీసం కనుక్కోకుండా అతడితో పెళ్లికి నిరాకరిస్తాడు. కూతురు తాను తెచ్చిన సంబంధాన్నే చేసుకోవాలని పట్టుబడుతుంటాడు.. కానీ.

కూతురు అడగ్గానే అన్ని తెచ్చి పెట్టే తండ్రి.. ఓ వ్యక్తిని ప్రేమించాను అని చెప్పగానే.. ఎలాంటి వాడు అని కనీసం కనుక్కోకుండా అతడితో పెళ్లికి నిరాకరిస్తాడు. కూతురు తాను తెచ్చిన సంబంధాన్నే చేసుకోవాలని పట్టుబడుతుంటాడు.. కానీ.

కూతురు కులాంతర వివాహం! కొట్టుకుంటూ తీసుకెళ్లిన తండ్రి! సినిమా రేంజ్ స్టోరీ!

చదువు, సంధ్యల దగ్గర నుండి వేసుకునే దుస్తుల వరకు అన్ని పిల్లల ఇష్టప్రకారమే చేసే తల్లిదండ్రులు.. పెళ్లిళ్ల విషయానికి వస్తే మాత్రం..బిడ్డలు తమ మాట నెగ్గాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లల తల్లిదండ్రులు.. కూతురు తాము తెచ్చిన సంబంధానికి తలవంచాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆమె మనస్సుల్లో ఎవరైనా ఉన్నారా అని అడగడం లేదు. ఉన్నా కూడా మర్చిపోయి..తాము చూసిన పెళ్లికొడుకునే చేసుకోవాలంటూ మొండిగా వ్యవహరిస్తున్నారు. ఇక కుమార్తె.. తమ కులం, మతం కాని వాడిని ప్రేమించిందని తెలిస్తే.. అతడ్ని అంతం చేసేందుకు కూడా నిమిషం ఆలోచించడం లేదు. దీంతో అమ్మాయిలు కూడా.. కని పెంచిన తండ్రిని కాదని, ప్రియుడితో పరారయ్యి గుడిలో వివాహం చేసుకోవడం, రిజిస్టర్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు.

తండ్రి తమ ప్రేమను కాదన్నాడన్న ఉద్దేశంతో ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. అయితే తమ ప్రేమకు గుర్తింపు దక్కాలన్న ఉద్దేశంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు ప్రేమికులు. దీని కోసం అన్ని ప్రిపేర్ చేసుకున్నారు. అంతలో ఎంటర్ అయ్యారు కూతురు తండ్రి. వారి రిజిస్టర్ మ్యారేజ్ అడ్డుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్ర దుర్గ జిల్లా మొళకాల్కూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే బీజీకెరె గ్రామానికి చెందిన ప్రవీణ్, పద్మజ అనే ఇద్దరు ఐదేళ్ల నుండి ప్రేమించుకున్నారు. పద్మజ మంగళూరు నర్సింగ్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా పని చేస్తుంది. కాగా, పద్మజది బీసీ సామాజిక వర్గం.. కాగా, ప్రవీణ్ ఎస్టీ వర్గానికి చెందిన అబ్బాయి.

కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను పెద్దలు కాదన్నారు. దీంతో గత వారం ఆలయంలో పెళ్లి చేసుకున్నారీ జంట. అయితే మంగళవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని మొళకాళ్మూరుకు బయలు దేరారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పద్మజ తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకుని బలవంతంగా బైక్ పై తీసుకెళ్లారు.రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆమె కుటుంబ సభ్యులు వచ్చి.. పద్మజను బలవంతంగా ఎత్తుకెళ్లారని, తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని.. పద్మజను ఆమె తండ్రి కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడని  ప్రవీణ్ ఆరోపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి