iDreamPost

ఓట్ల కోసం వచ్చే నేతలకు బుద్ధి వచ్చేలా.. వినూత్న రీతిలో దంపతులు నిరసన

ఎన్నికలు వచ్చాయంటే.. చిత్ర విచిత్ర విన్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతలు ఇంటింటికి వెళ్లి వంగి వంగి దండాలు పెడుతుంటారు. ఓట్ల కోసం కాలు పట్టుకోవడానికైనా వెనుకాడరు. ఎన్నికలు అయిపోాయాక.. పట్టించుకోరు.

ఎన్నికలు వచ్చాయంటే.. చిత్ర విచిత్ర విన్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతలు ఇంటింటికి వెళ్లి వంగి వంగి దండాలు పెడుతుంటారు. ఓట్ల కోసం కాలు పట్టుకోవడానికైనా వెనుకాడరు. ఎన్నికలు అయిపోాయాక.. పట్టించుకోరు.

ఓట్ల కోసం వచ్చే నేతలకు బుద్ధి వచ్చేలా.. వినూత్న రీతిలో దంపతులు నిరసన

మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధిని ఓటు ద్వారానే ఎన్నుకోగలరు.  ఒక్క ఓటుతోనే దేశ రాజకీయాలను శాసించే సత్తా ప్రజలకు ఉంది. అయితే కొన్ని తాయితాలకు తలొగ్గి.. తమ ఓటుకు ఉన్న సత్తా మరచి, దేశ సంక్షేమాన్నిగాలికివదిలేస్తున్నారు ఓటర్లు. నోటుకు, మద్యానికి, ఆఫర్లకు లొంగిపోతున్నాడు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే రాజకీయ నేతలు.. అనంతరం తమకు సమస్య వచ్చిందంటే.. పన్నెత్తి మాట్లాడరు కాదూ కాదూ కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఓడ దాటే దాక ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా వ్యవహరిస్తుంటారు.

ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇదే తంతు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా పార్టీల నేతలు ఇంటింటికి తిరిగి తమ పార్టీకి ఓటేయాలంటే, తమకే ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తుంటారు. ఇదే వారికి బుద్ది చెప్పే సమయమని భావించిన.. ఓ కుటుంబం పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసి.. నిరసన వ్యక్తం  చేసింది. ఇంతకు ఆ కుటుంబం ఫ్లెక్సీలో ఏమని పేర్కొందంటే..? మా సమస్యలు పట్టవు. మా ఓట్లు కావాలా అంటూ ప్రశ్నించింది. ఇంతకు అంత ధైర్యంగా ఫ్లెక్సీని పెట్టిన కుటుంబం.. యాద్రాది భువనగిరి జిల్లాలోని మెత్కూరు మున్సిపాలిటీలో ఉంది. 8వ వార్డులో సందీప్, సాయికుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. ఎప్పటి నుండో కాలనీలో మురుగు నీరు పోయేందుకు కాలువలు ఏర్పాటు చేయాలంటూ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నారు.

Couples against politics

అయినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మిన్నకుండి పోయారు. అయితే ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఇంటింటికి తిరుగుతారని భావించి.. ఓ పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసి.. తాము చెప్పాలనుకున్నదీ అందులో స్పష్టం చేశారు. ‘మా సమస్యలు పట్టవు, మా ఓట్లు మీకు కావాలా..? మీ కోసం ఓట్లకు మా ఇంటికి రాకండి. ఎన్నో ఏళ్లుగా, మా ప్రధాన సమస్య మురికి కాలువ కోసం మీకు చాలా సార్లు మొర పెట్టుకున్నాం. అయినా మా బాధలు మీకు పట్టలేదు. మా సమస్య తీర్చలేదు. మా పిల్లలతో సహా మా ఇంటిల్లిపాది ఆ మురికి కాల్వ కారణంగా దోమలు, దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నాం. ఆర్థికంగా నష్టపోతున్నాం, మా బాధలు పట్టని మీకు మా ఓటు అడిగే అర్హత లేదు. మా ఇంటికి రాకండి’ అంటూ రాజకీయ నేతలనుద్దేశించి తమ అభిప్రాయాన్ని ఫ్లెక్సీ రూపంలో నిరసన వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి