iDreamPost

Thandel OTT: భారీ ధరకు అమ్ముడు పోయిన తండేల్ OTT హక్కులు!

  • Published Apr 29, 2024 | 3:19 PMUpdated Apr 29, 2024 | 3:19 PM

ఈ మధ్య కాలంలో సినిమాలు ఇంకా థియేట్రికల్ రిలీజ్ కాకముందే .. ఓటీటీ పార్టనర్స్ మాత్రం ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న తండేల్ సినిమా ఓటీటీ హక్కులను ఓ ప్రముఖ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో సినిమాలు ఇంకా థియేట్రికల్ రిలీజ్ కాకముందే .. ఓటీటీ పార్టనర్స్ మాత్రం ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న తండేల్ సినిమా ఓటీటీ హక్కులను ఓ ప్రముఖ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

  • Published Apr 29, 2024 | 3:19 PMUpdated Apr 29, 2024 | 3:19 PM
Thandel OTT: భారీ ధరకు  అమ్ముడు పోయిన తండేల్ OTT హక్కులు!

నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి ప్రస్తుతం నటిస్తున్న సినిమా “తండేల్”. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్ అందరిని ఆకట్టుకుని.. మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 20 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాగా ఈ సినిమాకు కార్తీక్ మొండేటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీ లకు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం. సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవ్వడానికంటే ముందే. ఆయా సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడు పోతున్నాయి. ఈ క్రమంలో.. తండేల్ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరలకు అమ్ముడు పోయినట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తండేల్ సినిమాను అన్ని దక్షిణ భాషలతో పాటు.. హిందీలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, నాగ చైతన్య లతో పాటు ప్రియదర్శి కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమాను.. బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ప్రేక్షకులంతా కూడా.. ఆయా సినిమాల థియేటర్ రిలీజ్ కంటే.. ఆ సినిమాలు ఓటీటీ లోకి ఎప్పుడు వస్తాయా ఏ ప్లాట్ ఫార్మ్ వాటిని సొంతం చేసుకుండా అనే ఆరాలు తీయడం మొదలు పెట్టారు. దీనితో మేకర్స్ కూడా చాలా అడ్వాన్స్ గా ఆయా సినిమాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.40 కోట్లకు సొంతం చేసుకున్నట్లు .. ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నాగ చైతన్య కెరీర్ లోనే ఇంతవరకు ఈ రేంజ్ లో ఏ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడు పోలేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Thadnel

ఇక తండేల్ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. గతంలోనే నాగ చైతన్య ఈ సినిమా స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఇది కొన్ని యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. 2018 లో శ్రీకాకుళానికి చెందిన ఓ జాలరి అనుకోకుండా పాకిస్తాన్ సముద్రంలోకి ప్రవేశించాడు. దీనితో అతనిని పాకిస్థాన్ నేవి అరెస్ట్ చేయడం. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది తండేల్ సినిమా స్టోరీ లైన్. అయితే ఈ కథను ఎలా తెరపైన చూపించనున్నారు అనేది దానిపైన ఈ సినిమా ఆధారపడి ఉంది. అది చూడాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. మరి తండేల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి