iDreamPost

ఇరురాష్ట్రాల సరిహద్దు వద్ద ఉద్రిక్తత — రాళ్లు విసిరిన ప్రయాణికులు

ఇరురాష్ట్రాల సరిహద్దు వద్ద ఉద్రిక్తత — రాళ్లు విసిరిన ప్రయాణికులు

తెలంగాణ రాష్ట్రంలో హఠాత్తుగా కొన్ని హాస్టళ్ల మూసివేతతో పాటు ఏపీ ప్రభుత్వంతో ఏ విధమైన సంప్రదింపులు లేకుండా ఆంధ్రాకి తరలి వెళ్ళటానికి హైదరాబాదులోని కొన్ని పోలీసు స్టేషన్ల వారు ఇచ్చిన NOC లతో సరిహద్దుకు చేరుకున్నా వారు నిన్న జగ్గయ్యపేట పైపు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఆందోళనకు దిగగా అధికారులు వారితో చర్చించి కొందరిని వెనక్కి మరి కొందరిని నూజివీడులో ఐసొలేషన్ సెంటర్ కు పంపించారు.

గత రాత్రి ఆంద్ర అధికారులు తెలంగాణా అధికారులతో మాట్లాడి NOC విడుదల రద్దు చేపించారు.హాస్టల్స్ మూసివేయొద్దని KTR హెచ్చరిక చేసాడు. దీనితో చాల వరకు పరిస్థితి సద్దుమణిగింది కానీ ఈ సాయంత్రం హైద్రాబాదు నుంచి మిర్యాలగూడ వైపుగా వస్తున్నా వారిని పొందూరు బ్రిడ్జ్ వద్ద ఆంధ్రా పోలీసులు ఆపారు.దీనితో ఘర్షణ వాతావరణం నెలకొని ప్రయాణికులు పోలీసుల మీద రాళ్లు రువ్వారు. స్తుతం జిల్లా ఎస్పీ , డిఐజీ ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితి చక్కదిద్దే యత్నంలో ఉన్నారు .

దేశమంతా అత్యవసరంగా లాక్ డౌన్ ప్రకటించిన దశలో అటు తెలంగాణా ప్రభుత్వంతో , ఇటు ఏపీ ప్రభుత్వంతో సంప్రదించకుండా హాస్టల్స్ , కొందరు అధికారులు తీసుకొన్న పొరపాటు నిర్ణయాలకు లాక్ డౌన్ స్ఫూర్తి దెబ్బ తినడమే కాకుండా విద్యార్థుల్ని , ప్రజల్ని త్రిశంఖు స్వర్గంలో పెట్టినట్టు అయ్యింది .

అయినా మానవతా దృక్పథంతో రెండు ప్రభుత్వాలు సంప్రదించుకొని తెలంగాణాలో పూర్వ స్థితిలో జీవించటానికి , లేదా బోర్డర్ దాటి ఏపీ వచ్చే పక్షంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా మెడికల్ టెస్టులు చేయించుకొని 14 రోజులు క్వారంటయిన్ కి వెళ్లే విధంగా నిర్ణయించి రెండింటిలో ఏది పాటించాలి అనే విషయం ప్రయాణీకుల ఛాయిస్ కిచ్చారు .

అయితే వెనక్కి పోతే హాస్టల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళనలో ఉన్న ప్రజలు ఇటు క్వారంటయిన్ కి ఇష్టపడక తాము ఆరోగ్యంగానే ఉన్నాము అని ఇళ్ళకి పంపమని నిన్నటి నుండి డిమాండ్ చేస్తుండగా ప్రజారోగ్యం దృష్ట్యా ఏపీ పోలీస్ అనుమతించకుండా క్వారంటయిన్ కి ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది .

అయితే సహనం కోల్పోయిన కొందరు ప్రజలు దాచేపల్లి మండలం పొందుగుల వద్ద పోలీసుల పై రాళ్లతో దాడి చేయగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొంటామని ఏపీ డీజీపీ ప్రకటించారు .

అయితే కరోనా కారణంగా సర్వం లాక్ డౌన్ చేసిన ఈ సందర్భంలో కేసులు అరెస్టులు అంటూ వారిని తద్వారా బంధువుల్ని ఇబ్బంది పెడుతు సమస్యను జటిలం చెయ్యటం కన్నా రాళ్లు రువ్విన వారి మానసిక పరిస్థితిని అర్ధం చేసుకొని సమస్యను చట్టపరంగా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించాలి. వారిని అరెస్టు చేయడం కన్నా క్వారంటయిన్ కి ఒప్పించి సమస్య పరిష్కరించడమే ఉత్తమం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి