iDreamPost

సీఎం జగన్‌.. చెప్పిన టైం కంటే.. ఐదు రోజులు ముందే చేశారు

సీఎం జగన్‌..  చెప్పిన టైం కంటే.. ఐదు రోజులు ముందే చేశారు

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దూసుకెళుతున్నారు. పథకమైనా, అభివృద్ధి పని అయినా.. నిర్ణీత సమయం నిర్థేశించుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ మేరకు వాటిని పూర్తి చేస్తూ పరిపాలనను సరికొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇటీవల మంత్రివర్గంలో ఫిష్సింగ్‌ హార్బర్ల నిర్మాణంపై తీర్మానం చేయగా.. తాజాగా వాటికి టెండర్‌ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. డిసెంబర్‌ 15వ తేదీ కల్లా ఫిష్సింగ్‌ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేస్తామని చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఐదు రోజులు ముందుగానే ఆ ప్రక్రియను పూర్తి చేసి మత్య్సకారుల సంక్షేమం, అభివృద్ధిలో తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.

రాష్ట్రంలోని ఎనిమిది తీర ప్రాంత జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఫిష్సింగ్‌ హార్బర్లను రెండు దశల్లో నిర్మించాలని జగన్‌ ప్రభుత్వం తలపెట్టింది. ఇందులో భాగంగా తొలి విడతగా నాలుగు ఫిష్సింగ్‌ హార్బర్లకు ఈ రోజు టెండర్లు ఖరారు చేసింది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలలో ఫిష్సింగ్‌ హార్బర్లను నిర్మించనున్నారు. వీటికి ఉమ్మడిగా ఒకే టెండర్‌ను ప్రభుత్వ ఏర్పాటు చేసిన మారిటైం బోర్డు పిలిచింది.

నాలుగు ఫిష్సింగ్‌ హార్బర్ల నిర్మాణానికి గాను 1205.77 కోట్ల రూపాయలతో టెండర్‌ ఖరారు అయినట్లు మారిటైం బోర్డు తెలిపిది. రివర్స్‌ టెండర్‌లో ప్రభుత్వానికి 60 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని వెల్లడించింది. ఎంఆర్‌కేఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ ఈ టెండర్‌ను దక్కించుకుంది. రెండేళ్లలో నాలుగు ఫిష్సింగ్‌ హార్బర్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి