iDreamPost

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 40కిపైగా బోట్లలో మంటలు

  • Published Nov 20, 2023 | 8:46 AMUpdated Nov 20, 2023 | 8:46 AM

ఆదివారం అర్థరాత్రి విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం వివరాలు..

ఆదివారం అర్థరాత్రి విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం వివరాలు..

  • Published Nov 20, 2023 | 8:46 AMUpdated Nov 20, 2023 | 8:46 AM
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 40కిపైగా బోట్లలో మంటలు

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం వల్ల సుమారు 40 బోట్లలో మంటలు చెలరేగాయి. ప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుందని అంటున్నారు. సాధారణంగా హార్బర్‌లో మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ లంగరు వేసి ఉంచుతారు. మంటల్లో చిక్కుకున్న బోట్లన్ని కూడా అలా ఉంచినవే. అంతేకాక మూడు రోజుల క్రితం సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరాయి. అయితే ఎలా జరిగిందో తెలియదు కానీ.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఓ పడవలో నుంచి మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది మిగిలిన బోట్లకు అంటుంకుంది. అలా మొత్తం 40కుపైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మంటలు అంటుకున్న బోట్లలో రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద ఉంది. సోమవారం ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు తెలిపారు. ప్రమాదం వల్ల తమ సంపద అంతా అగ్నికి ఆహుతయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదంటున్నారు.‌ ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో మత్స్యకారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

మంటలను గమనించిన వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అందుబాటులో ఉన్న అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించాయి. అయితే వారి ప్రయత్నాన్ని సముద్ర గాలులు ముందుకు సాగకుండ చేశాయి. ఈ గాలులు కారణంగా మంటలు మరింతగా రేగి పక్కనున్న బోట్లకు విస్తరించడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది అంటున్నారు. అయితే కొందరు మత్సకారులు ధైర్యం చేసి వారి బోట్లను సముద్రంలోకి తీసుకుపోవడంతో కొంతమేర ఆస్తి నష్టం తగ్గింది. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా రాత్రి పూట బోట్లలో మత్స్యకారులు ఎవరూ ఉండరని.. అయితే ప్రమాద సమయంలో వాటిలో ఎవరైనా ఉండిపోయారా అనేది తెలియరావడం లేదు అంటున్నారు అదికారులు. కాగా కళ్లముందే తమ జీవనాధారమైన బోట్లన్నీ మంటల్లో కాలిపోతుండడం చూసి కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మత్స్యకారులు కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఎవరో ఆకతాయిలు కావాలనే మంటలు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి