iDreamPost

జగన్ సామాన్యుడిగా ఉన్నప్పుడే నన్ను చదివించారు: యూట్యూబర్ కుసుమ్

YS Jagan: విద్య వ్యవస్థపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉన్న శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అయితే ఇలా చదువుపై ప్రత్యేక శ్రద్ధ.. ఆయనకు సీఎం కాకముందే ఉంది. అందుకు నిదర్శనంగా తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియో.

YS Jagan: విద్య వ్యవస్థపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉన్న శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అయితే ఇలా చదువుపై ప్రత్యేక శ్రద్ధ.. ఆయనకు సీఎం కాకముందే ఉంది. అందుకు నిదర్శనంగా తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియో.

జగన్ సామాన్యుడిగా ఉన్నప్పుడే నన్ను చదివించారు: యూట్యూబర్ కుసుమ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి మనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతరులకు సాయం చేయడం, తనను నమ్మిన వారిని జీవితాంతం వదలకపోవడం వంటి గుణాలను తండ్రి వైఎస్సార్ నుంచి సీఎం జగన్ పుణికి పుచ్చుకున్నారు. కష్టం అంటూ తన వద్దకు వచ్చి వారికి నేనున్నానంటూ ధైర్యం కల్పించడంలో సీఎం జగన్ ముందుంటారు. అయితే మనకు తెలిసింది… అడిగిన వారికి మాత్రమే సాయం చేసే సీఎం జగన్, కానీ మనకు తెలియని మరో కోణం ఆయనలోఉంది. అదే కష్టాల్లో ఉన్న వారు అడగక ముందే వారి పరిస్థితిని అర్థం చేసుకుని సాయం చేస్తుంటారు సీఎం జగన్. అందుకు ప్రత్యక్ష నిదర్శనం.. ఆయన ద్వారా సాయం పొందిన ప్రముఖ యూట్యూబర్ కుసుమ్ గంజి చెప్పిన మాటలు. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పగా ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోన్నాయి.

ప్రముఖ యూట్యూబర్ కుసుమ్ గంజి గురించి సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  ఆయన ‘తెలుగు టీ టాక్’ పేరుతో వీడియోలు చేసి.. తెలుగు వారికి అనేక విషయాలను తెలియజేస్తుంటారు. మన ఇళ్లలో వినియోగించే ప్రతి వస్తువు గురించి, ఎక్కడ అతి చౌకగా దొరుతాయో ఆయన  తెలియజేస్తుంటారు. సోఫాలు, బెడ్, టీవీ,  వాషింగ మిషిన్, కంప్యూటర్స్,  శారీస్, ఫర్నీచర్, కిచెన్ కు అవసరమయ్యే వస్తువులు, సెకెండ్ హ్యాడ్ కార్లు.. ఇలా అనేక వస్తువుల గురించి వీడియోలు చేస్తుంటారు. ఆయనకు లక్ష 32 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఫేమస్ అయిన ఈయన కూడా ప్రారంభంలో అనేక కష్టాలు పడ్డారు. ముఖ్యంగా చదువు విషయంలో పొలాన్నే అమ్ముకున్నారంట. అయితే తాను చదువుకునే విషయంలో సీఎం జగన్ సాయం చేశారని తెలిపారు. ఆయన గతంలో  చేసిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఏపీలో విద్యావ్యవస్థకు జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఆ ఇంటర్వ్యూలో కుసుమ్ గంజి మాట్లాడుతూ..” నేను స్కాలర్ షిప్ తో చదివాను. స్కాలర్ షిప్ కూడా సీఎం జగన్ గారు ఇప్పించారు. అయితే  ఆ సాయం ఆయన సీఎం కాక ముందు చేశారు. ఎయిర్ పోర్ట్ లో నన్ను జగన్ గారు కలిశారు. ఎక్కడి వెళ్తున్నావని అడగ్గా.. ఎబ్రాడ్ వెళ్తున్నానని,  పొలం అమ్మేసి వచ్చే డబ్బులతో అక్కడ చదువుకునేందుకు వెళ్తున్నాని చెప్పాను. పొలం ఎందుకు అమ్మినావని అడిగారు. డబ్బులు లేవు సార్.. కానీ చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అందుకే అమ్మేశానని తెలిపాను.  ఇదే సమయంలో తన పక్కన ఉండే సిబ్బందికి చెప్పారు. వాళ్లు నా నెంబర్ తీసుకున్నారు. ఇక్కడ అనుకోకుండానే కలిశాము. ఇలా ఒక వ్యక్తిని పంపించి.. నాకు ఎన్ని మార్కులు వచ్చాయో కనుకున్నారు. ఫీజు కట్టారు.. చదివించారు. నావి సగం డబ్బులు, జగన్ గారు సగం డబ్బులు సాయం చేయడంతో చదువును పూర్తి చేశాను” అని కుసుమ్ గంజి తెలిపారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  విద్యారంగంలో  సీఎం జగన్ చేస్తున్న కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు చదువుపై ఉన్న ఆసక్తి, చదువుకునే వారికి సాయం చేయాలనే గుణం ముఖ్యమంత్రి కాక ముందే ఉంది. అందుకు  నిదర్శనమే ప్రస్తుతం వైరల్ అవుతోన్న గంజి కుసుమ్ వీడియో. అలా సీఎం కాకముందే చదువుకోవాలని తపన ఉన్న పేదవారికే సాయం చేసిన జగన్.. సీఎం అయ్యే ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పేద వారు ఎవ్వరూ చదువు విషయంలో ఇబ్బందులకు గురికాకుడదని  ఎన్నో స్కీమ్ లు ప్రారంభిచారు. పేద విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబడేలా విద్యారంగంలో సీఎం జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. చదువుపై ఆయనకు ఉన్న ఆసక్తి అధికారంలోకి వచ్చినప్పుడు పుట్టింది కాదని, ఆయనకు ఎప్పటి నుంచో ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. మరి.. సీఎం జగన్ గురించి ఈ యూట్యూబర్ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి